కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్లు లేకున్నా కట్టెలు కొట్టి, ఇంటిపనులు చేసి, చిరు బండారాలు అమ్ముతూ..

అత‌ని ఆత్మ‌విశ్వాసం అత‌న్ని న‌డిపిస్తుంది. అత‌ని ప‌ట్టుద‌ల కుటుంబాన్నీ పోషిస్తుంది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: అత‌ని ఆత్మ‌విశ్వాసం అత‌న్ని న‌డిపిస్తుంది. అత‌ని ప‌ట్టుద‌ల కుటుంబాన్నీ పోషిస్తుంది. అన్నీ అవ‌య‌వాలు స‌రిగా ఉండి సోమ‌రుల్లా తిరుగుతున్న ఈ రోజుల్లో రెండు క‌ళ్లు క‌నిపించ‌కున్న తినుబండారాలు అమ్ముతు కుటుంబాన్నీ పోషిస్తున్న ఓ అమావాస్య చంద్రుడి క‌థ ఇది..

 బొమ్మకంటి రమేష్

బొమ్మకంటి రమేష్

జ‌గిత్యాల్ జిల్లా రాయిక‌ల్ మండ‌లం తాట్లవాయి గ్రామాన్ని చెందిన ఇత‌ని పేరు బొమ్మ‌కంటి ర‌మేశ్‌. ఇత‌నికి చిన్న ప్రాయంలోనె పోలియె బారిన ప‌డి రెండు క‌ళ్లు పోయాయి. ఎన్నో అసుప‌త్రులు తిరిగారు. ఎంతొ ఖ‌ర్చు పెట్టుకున్నారు. కానీ ర‌మేశ్ కు క‌ళ్లు రావ‌ని చెప్పారు డాక్ట‌ర్లు.

వివాహం

వివాహం

గ‌త 9 సంవ‌త్స‌రాల క్రితం ర‌జిత అనె అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ర‌మేశ్‌. వాళ్లిద్ద‌రికి ఇద్ద‌రు పిల్ల‌లు. తెచ్చుకున్న అప్పులు కుప్ప‌లు కావ‌టం ఓవైపు బాధిస్తుంటే మ‌రో వైపు, త‌ల్లీ రాజ‌మ్మ‌, తండ్రీ రాజ‌య్య‌లు వ‌య‌సుపైబ‌డి ఆనారోగ్య‌పాలు కావ‌టం ర‌మేశ్ ను మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టివేసింది.

చూపులేకున్నా కాలినడకన

చూపులేకున్నా కాలినడకన

ఐదుగురిని సాకాలంటె తాను ఏదో ఒక‌ప‌ని చెయ్యాల‌ని అత‌ను అనుకున్నాడు.చూపు లేకున్న త‌న గ్రామ శివారులోని క‌ల్లు మండువ వ‌ద్దకు కాలి న‌డ‌క‌న వెళ్లి తినుబండారాలు అమ్ముతు వ‌చ్చె డ‌బ్బుల‌తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ర‌మేశ్‌కు క‌ళ్లు కనబడకపోయినా క‌ర్ర‌సాయంతో ఎక్క‌డికైన వెళ్ల‌గ‌లుగుతాడు.

 తినుబండారాలు అమ్ముతాడు

తినుబండారాలు అమ్ముతాడు

అలాగె ఇంటిలో ఉన్న‌ప్పుడు ఇంటిప‌నులు కూడా చేస్తాడు. గుడాలు, బ‌జ్జీలు, మ‌క్క అటుకులు, ఇలా ప‌లు ర‌కాల తినుబండారాల‌ను త‌ల‌పైన ఎత్తుకొని అమ్ముతాడు. అయితె వారంద‌ర‌ని సాక‌టం ఒక ర‌మేశ్ వ‌ల్ల కావ‌టం లేదు, ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు క‌ష్ట‌ప‌డుతూనె ఉంటాడు.ఇద్ద‌రు పిల్ల‌లు ఇప్పుడు ఒక‌రు 3 త‌ర‌గ‌తి, మ‌రొక‌రు నాల‌గ‌వ త‌ర‌గ‌తి చదువుతున్నారు.

 అప్యాయంగా పలకరిస్తారు

అప్యాయంగా పలకరిస్తారు

ర‌మేశ్‌ను చూసి ఆ చుట్టుప‌క్క గ్రామాల వారు ఎంతొ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తారు. ఎందుకంటె త‌న‌కు రెండు క‌ళ్లు లేకున్నా ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడని, ఇలాంటి వారు ఎంద‌రికో ఆద‌ర్శం.

English summary
A story of handicapped in Jagityal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X