నారాయణ జూనియర్ కళాశాల విద్యార్ధి మృతి.. కొనసాగుతున్న మరణ మృదంగం!
కళాశాలలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ కళాశాలలలో చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలను హరిస్తుంది. కొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటే మరికొందరు విభిన్న కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నారాయణ కళాశాలలో ఒక విద్యార్ధి మృతి చెందారు.
కాలేజీ భవనం పై నుండి క్రింద పడి విద్యార్థి మృతి
నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న శివ అనే విద్యార్థి కాలేజీ భవనం పై నుండి క్రింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విద్యార్థి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విద్యార్థి. నిన్న రాత్రి కళాశాలలో జరిగిన ఈ ఘటనలో గ్రిల్ సరిగ్గా లేకపోవటంతో విద్యార్థి ప్రమాదవశాత్తు జారి క్రింద పడిపోయాడు. దీంతో విద్యార్థి మృతి చెందాడు.

బాచుపల్లి నారాయణ కాలేజ్ లో రెండు రోజుల క్రితం విద్యార్థిని మృతి
ఈ విషయం తెలిసిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. విద్యార్థి విగత జీవిగా మారాడు..ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది . అనూష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దసరా సెలవుల తర్వాత కళాశాలకు వచ్చిన క్రమంలో ఆమె విగత జీవిగా మారటం అందరినీ షాక్ కు గురి చేసింది.
ఉరివేసుకుని చనిపోయిన విద్యార్థిని
ఆమె తల్లిదండ్రులు విద్యార్థినిని కాలేజీలో దింపి హైదరాబాద్ దాటే లోపే విద్యార్థిని స్పృహ కోల్పోయిందన్న సమాచారంతో మళ్ళీ తల్లిదండ్రులు కళాశాలకు వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
జూన్ లో నారాయణ కాలేజ్ లో మరో విద్యార్థి మృతి
గత జూన్ నెలలో కూడా ఒక విద్యార్ధి నారాయణ కళాశాలలో చదవటం ఇష్టంలేక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా హాయ్ టెన్షన్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ మండలంలోని కోహెడ గ్రామానికి చెందిన నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న కర్రే కిషోర్ కుమార్ కళాశాల నుండి పారిపోయే క్రమంలో విగత జీవిగా మారాడు. కారణాలు ఏవైనా సరే జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న తీరు తీవ్ర ఆవేదనకు కారణంగా మారుతుంది.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications