Viral Video: కీరవాణి గారు ఈ మట్టిలో మాణిక్యానికి అవకాశం ఇవ్వండి.. సజ్జనార్ ట్వీట్..
వైకల్యం శరీరానికి తప్ప మనస్సు కు కాదు. అన్ని సరిగా ఉన్నా జులాయిగా తిరిగే వారు ఉన్నారు. వైకల్యం ఉన్నా.. కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఉన్నారు. అయితే కొంత మందికి టాలెంట్ ఉన్నా.. ప్రపంచం గుర్తించలేదు. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్ " అని సంగీత దర్శకుడు కీరవాణిని ట్యాగ్ చేశారు.
ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడు రామ రామ రఘు రామ అని పాడుతున్న హనుమా.. ఇంత భక్తి పరవశమా అంటూ పాట పాడాడు. అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లా పాడాడు. ఈ వీడియో చూసిన వారంతా దివ్యాంగుడిని అభినందిస్తున్నారు. బస్సులో ఉన్న వారంతా ఆ అంధ యువకుడి పాటకు ముగ్దులయ్యారు. ఈ వీడయో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా చూశారు. అంధ యువకుడికి సంగీత దర్శకులు అవకాశం ఇవ్వాలన చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు. అయితే సజ్జనార్ విజ్ఞప్తిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆర్టీసీ ఎండి సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతను తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అవయవాలు దానం చేశాడు. ఇదే విషయాన్ని సజ్జనార్ ట్వీట్ చేశారు. "మరణించిన తర్వాత జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయి. ట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి అవయవాలను దానం చేసి.. ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించిన వెంకటేష్ నాగేష్ కులకర్ణి తల్లిదండ్రులది గొప్ప మనుసు" అంటూ ట్వీట్ చేశారు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS
సజ్జనార్ సైబర్ నేరాలపై కూడా ప్రజలను అప్రమత్తం చేస్తారు. "ఆన్ లైన్ లో సులువుగా డబ్బు సంపాదించవచ్చంటే.. గుడ్డిగా నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications