కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Transgender Marriage: ట్రాన్స్ జెండర్‍ను పెళ్లాడిన యువకుడు.. ఆ తర్వాత..!

|
Google Oneindia TeluguNews

ఇది వరకు అబ్బాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవడం విన్నాం. అమ్మాయిని అమ్మాయి వివాహం చేసుకోవడం చూశారం. కానీ తాజాగా ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అర్షద్, వీణవంకకు చెందిన ట్రాన్స్ జెండర్ దివ్య ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు ఇళ్లలో చెప్పారు. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో బంధువులు సపోర్ట్ చేయకపోయినా వారిద్దరు ఒకటైయ్యారు. అర్షద్, దివ్య వివాహం చేసుకున్నారు.

ఇల్లందకుంట

ఇల్లందకుంట

పెళ్లి అనంతరం వీరిద్దరు కరీంనగర్ జిల్లాఇల్లందకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. వీరి పెళ్లి స్థానికంగా సంచలనం సృష్టంచింది. వీరి ఊళ్లలో ప్రస్తుతం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట పెళ్లి చేసుకున్నారు. గతంలో ఈ జంటను ఇరు కుటుంబాలు వేరు చేశాయి. అయితే కేరళ హైకోర్టు తీర్పుతో వీరిద్దరు మళ్లీ ఒకటయ్యారు. పాఠశాల నుంచి వీరిద్దరు కలిసి చదువుకుని ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.అలాగే కొద్ది రోజల క్రితం ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారికి చట్టం వర్తిచదు.

సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు


అందుకే ఇందుకు సంబంధించి ఈ మధ్య సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఈ సమస్య నవతేజ్ సింగ్ జోహార్, పుట్టస్వామి తీర్పులకు "సీక్వెల్" అని పేర్కొన్నారు. "ఇది జీవన సమస్య, ఆస్తి సమస్య కాదు. మేము ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నాము" అని అన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టులో 9 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

కేరళ హైకోర్టు

కేరళ హైకోర్టు


పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్, కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ హైకోర్టు ముందు కేంద్రం చేసిన ప్రకటనపై ధర్మాసనానికి తెలిపారు. స్వలింగ జంటల గ్రాట్యుటీ, దత్తత, సరోగసీ వంటి ప్రాథమిక హక్కులను ఈ సమస్య ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

English summary
A young man married a transgender in Karimnagar district. Photos related to this are going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X