ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్లు: అమ్మాయిలకు అశ్లీల చిత్రాలు పంపిన ఆకతాయికి దేహశుద్ది

ఖమ్మం: ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు తెరిచి అమ్మాయిలకు అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపిస్తూ దుర్భాషలాడిన ఓ యువకుడికి బాధితుల బంధువులు దేహశుద్ది చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భద్రాచలం ప్రాంతంలోని సీతారాంనగర్‌కు చెందిన బాలరాజు అనే నిందితుడు ఐటిఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో అకౌంట్లు తెరిచి తనకు తెలిసిన ఇతర అమ్మాయిలకు అశ్లీల చిత్రాలు, సందేశాలు, దుర్భాషలాడుతూ పలు సందేశాలు పంపుతున్నాడు.

దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు బాలరాజు ఇంటిపై గురువారం రాత్రి దాడి చేశారు. కుటుంబసభ్యలతోపాటు బాలరాజుకు దేహశుద్ధి చేశారు. బాధితుల దాడిలో బాలరాజుకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాలైన కారణంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

A youth thrashed by villagers for sending obscene images to girls

కీచక పంతులుకు దేహశుద్ధి

విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి.. విద్యార్థినులను లైంగిక వేధించడంతో అతడ్ని తల్లిదండ్రులు చితకబాదారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని తెల్దారుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గడిపూడి వీరయ్యచౌదరి కొంతకాలంగా విద్యార్థినులకు సెల్‌ఫోన్‌లో ఆశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో కొద్దిరోజులుగా విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడం లేదు. తల్లిదండ్రులకు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు వెళ్లి వీరయ్య చౌదరిని నిలదీసి చితకబాదారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+