రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు ఉచిత చికిత్స.. అందరికీ తెలియాల్సిన కేంద్రపథకం!
కేంద్ర ప్రభుత్వంసామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం పూర్తి పేరు ప్రధాన మంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్. ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ వైద్య సహాయం అందేలా చూస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా, డబ్బులు లేకపోతే చికిత్స ఆలస్యం అవుతుంది. దీని వల్ల అనేకమంది ఆర్ధిక కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పీఎం రాహత్ పథకం రూపొందించారు. దీని కింద ప్రతి అర్హుడైన బాధితుడికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స లభిస్తుంది. ఈ ప్రయోజనం ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు వర్తిస్తుంది.

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ లేదా నగర రోడ్లపై జరిగిన ప్రమాదాలకు ఈ పథకం వర్తిస్తుంది. మోటారు వాహనాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారందరూ ఈ పథకం పొందటానికి అర్హులు. సాధారణ గాయాలకు 24 గంటలు, తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో 48 గంటల వరకు స్టేబిలైజేషన్ చికిత్స అందిస్తారు. ఆసుపత్రులు బిల్లులను మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుంచి తిరిగి పొందుతాయి.
ఈ పథకం పూర్తిగా డిజిటల్ వ్యవస్థపై ఆధారపడి పని చేస్తుంది. దీనికోసం ఇ-డీఏఆర్ ప్లాట్‌ఫామ్, నేషనల్ హెల్త్ అథారిటీ టీఎంఎస్ 2.0 వ్యవస్థలను అనుసంధానించారు. ప్రమాదం జరిగిన వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆసుపత్రికి సమాచారం అందుతుంది. బాధితుడికి డిజిటల్ విక్టిమ్ ఐడీ కేటాయిస్తారు. కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా ముందస్తుగా చెల్లించాల్సిన అవసరం లేదు.
గోల్డెన్ అవర్ ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన చికిత్స అందితే 50 శాతం మరణాలను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సహాయం చేసే రహ్-వీర్ గుడ్ సమరిటన్స్ కు కూడా రక్షణ కల్పిస్తారు. తెలంగాణలో కూడా ఈ పథకం అమలు జరుగుతోంది. ఇప్పటికే ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications
