ఓవైసీ చిత్తశుద్ధికి సిసలైన పరీక్ష-బీఆర్ఎస్ కు దూరంపై అనుమానాలు ! బీజేపీ బీ టీమ్ వాదన వేళ !

గత దశాబ్ద కాలంగా హైదరాబాద్ దాటి పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, స్ధానిక ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎం ఏపీలో మాత్రం ఎంట్రీ ఇవ్వడం లేదు. అలాగే ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగుతూ హైదరాబాద్ లో తమ ప్రయోజనాలు కాపాడుకుంటోది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీతో ఓవైసీ పార్టీ కలిసి ముందుకు సాగుతుందా లేదా అన్న దానిపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఏర్పాటు వేళ ఓవైసీ కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణం.

 అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్

అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్

హైదరాబాద్ ఎంపీగా వరుసగా గెలుస్తూ వస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నగరాన్ని దాటి తెలంగాణలోని ఇతర సీట్లలోనూ తమ పార్టీ తరఫున అభ్యర్ధుల్ని నిలబెడుతున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తున్నారు. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఓవైసీ, ఆయన పార్టీ, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం విపక్షంగా బరిలోకి దిగుతోంది. ఇందుకు చిన్నా చితకా పార్టీల సాయం తీసుకుంటోంది. తమకు ఏమాత్రం బలం లేకపోయినా ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లోకి అడుగుపెట్టి భారీ ఎత్తున సభలు నిర్వహించి ప్రచారం కూడా చేసేస్తోంది. దీంతో ఆయా చోట్ల కాంగ్రెస్ తో పాటు ఇతర సెక్యులర్ పార్టీల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతోంది.

 బీజేపీ-బీ టీమ్ గా ప్రచారం

బీజేపీ-బీ టీమ్ గా ప్రచారం

యూపీ, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తాజాగా గుజరాత్ లో ఎంఐఎం బరిలోకి దిగుతోంది. అయితే ఈ రాష్ట్రాల్లో బెంగాల్ మినహా నిన్న మొన్నటి వరకూ బీజేపీ అధికారంలో ఉండటమో,లేక తాజాగా అధికారంలోకి రావడమో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐకమత్యంగా పోటీ చేయలేకపోతుండగా.. మధ్యలో ఎంఐఎం పోటీ చేస్తూ అక్కడి ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకతను పంచుకుంటోంది. తద్వారా విపక్షాల ఓట్లను కూడా చీలుస్తోంది. ఇది అంతిమంగా బీజేపీకి ప్రయోజనం చేస్తోంది. దీంతో బీజేపీ బీ టీమ్ గా ఎంఐఎం పేరు తెచ్చుకుంది. అయినా ఓవైసీకి ఎలాంటి బెంగా లేదు. ఎక్కడెక్కడో వెళ్లి పోటీ చేస్తున్న ఎంఐఎం ఏపీకి ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు.

 బీఆర్ఎస్ ఏర్పాటు వేళ మరోసారి ?

బీఆర్ఎస్ ఏర్పాటు వేళ మరోసారి ?

తెలంగాణలో బీజేపీపై వ్యతిరేకతతో పుట్టిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు ఓవైసీ మద్దతు ఉంటుందని, ఆ పార్టీ ఏర్పాటు దగ్గరి నుంచి అన్ని చోట్లా ఓవైసీ ప్రభావం ఉంటుందని అంతా భావించారు. అలాగే ఏపీలోనూ కేసీఆర్.. ఓవైసీ సాయం తీసుకుని ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నారు. కానీ ఓవైసీ ఆరంభంలోనే కేసీఆర్ కు షాకిచ్చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు వేళ అసదుద్దీన్ ఓవైసీ కనిపించలేదు. అలాగే ఆయన పార్టీ నేతలు కూడా కనిపించలేదు. చివరికి ఎక్కడెక్కడో పంజాబ్ నుంచి కూడా నేతలు వచ్చి బీఆర్ఎస్ ఏర్పాటులో దర్శనమిచ్చినా ఓవైసీ మాత్రం రాలేదు. దీంతో బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఉంటుందా లేదా, జాతీయ స్ధాయిలో బీఆర్ఎస్ తో కలిసి ఓవైసీ పార్టీ ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది.

 ఓవైసీ చిత్తశుద్దికి పరీక్ష ?

ఓవైసీ చిత్తశుద్దికి పరీక్ష ?

ఇన్నాళ్లూ బీజేపీకి బీ టీమ్ గా తన పార్టీ ఎంఐఎంపై వస్తున్న విమర్శల్ని కొట్టి పారేస్తున్న ఓవైసీ ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో సహకరించకుండా మిన్నకుండిపోతే మాత్రం కచ్చితంగా ఈ విమర్శలు నిజం అవుతాయి. బీజేపీకి పరోక్షంగా మద్దతుగా నిలవడం ద్వారా బీఆర్ఎస్ కు దూరం కావాలని ఓవైసీ నిర్ణయించుకుంటే మాత్రం అది కేసీఆర్ కు కూడా ఎదురుదెబ్బ అవుతుంది. అసలే ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నిలదొక్కుకుంటే సరి. లేకపోతే రాబోయే బీజేపీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన ఇబ్బంది అనుకుంటున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓవైసీ స్పష్టమైన వైఖరి ప్రదర్శించకపోతే మాత్రం భవిష్యత్తులో బీజేపీ బీ టీమ్ ముద్ర మరింత సుస్ధిరమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+