బన్నీ నా జూనియర్: కాఫీ ప్రమోషన్‌లో నిజాలు చెప్పిన హీరో కార్తీ
హైదరాబాద్: నటుడు కార్తీ బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ 'బ్రూ రోస్ట్ అండ్ గ్రౌండ్' సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ తనకు అత్యంత ప్రియమైన బ్రూ కాఫీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

నాగార్జున నాకు సోదరుడు
తన మూడేళ్ల వయసు నుంచే కాఫీ తాగడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. హీరో నాగార్జున తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన కార్తీ, ఆయనతో నటించడం చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయనతో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే తప్పక చేస్తానని అన్నారు.

తమన్నా, కాజల్ అందరం మంచి ఫ్రెండ్స్
తమన్నా, కాజల్ మంచి ఫ్రెండ్స్ అని అందరం దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించామని వాళ్లు తనకు మంచి స్నేహితులని కార్తీ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో చిత్రాలేవీ చేయడం లేదన్న తమిళంలో తాను చేసిన కాష్మోరా త్వరలోనే విడుదల కానుందని, మరో చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.

బన్నీ నాకు మంచి మిత్రుడు
'సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్(బన్నీ) నాకు మంచి మిత్రుడు. అయితే నేను చదువుకున్న స్కూల్లోనే బన్నీ చదివాడు. బన్నీ నా జూనియర్ అని తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను' అని కార్తీ అన్నారు. తమ సొంత బ్యానర్లో బన్నీతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.

అన్నయ్య సూర్యతో మాత్రం కలిసి నటిస్తా
కుటుంబంతో కలిసి నటించే ఉద్దేశం అయితే లేదు కానీ, అన్నయ్య సూర్యతో మాత్రం కలిసి నటిస్తానని కార్తీ తెలిపారు. కాగా, లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications