ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదిలాబాద్‌ను విభజించి, కొమరం భీంగా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అదిలాబాద్/హైదరాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాను విభజించి ఏర్పాటు చేయనున్న జిల్లాకు ఆదివాసీ యోధుడు కొమరం భీమ్ పేరును పెట్టనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

అదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఏర్పడే ఈ కొత్త జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి ఆదివాసీలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

గిరిజనుల విముక్తి కోసం ఆదిలాబాద్‌ జిల్లా జోడేఘాట్‌ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించి, అమరుడైన కొమరం భీమ్ 74వ వర్థంతి కార్యక్రమాలను బుధవారం ఆయన స్మారకస్థలిలో అధికారికంగా ప్రారంభించారు.

కొమరం భీమ్

కొమరం భీమ్

కొమరం భీమ్ ప్రసిద్ధ నినాదం‘మావనాటే..మావ రాజ్‌' (మా గ్రామంలో మా ప్రభుత్వం) స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు.

 కొమరం భీమ్

కొమరం భీమ్

మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ దండకారణ్య అంచు అటవీ ప్రాంతానికి నేతలు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. పోలీసులూ గట్టి నియంత్రణ విధించేవారు.

 కొమరం భీమ్

కొమరం భీమ్

ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సొంతం చేసుకొన్న కేసీఆర్‌.. ఈ సందర్భంగా ఆదివాసీలపై వరాల జల్లు కురిపించారు.

 కొమరం భీమ్

కొమరం భీమ్

బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన జోడేఘాట్‌కు చేరుకున్నారు. భీమ్ సమాధి వద్ద నివాళి అర్పించి.. గిరిజన ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

 కొమరం భీమ్

కొమరం భీమ్

అనంతరం భీమ్ స్మారక చిహ్నాన్ని, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన పేరిట నిర్మిస్తున్న మ్యూజియానికి శంకుస్ధాపన చేశారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.

కొమరం భీమ్

కొమరం భీమ్

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జోడేఘాట్‌ అనువుగా ఉన్నదని కేసీఆర్ వివరించారు. దీనికోసం మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నామని చెప్పారు.

 కొమరం భీమ్

కొమరం భీమ్

జోడేఘాట్‌లో పావు తక్కువ 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, కొండలు, కోనలు, అడవులతో ఈ ప్రాంతం కశ్మీర్‌ని తలపిస్తున్నదని అన్నారు.

కొమరం భీమ్

కొమరం భీమ్

100 ఎకరాలు సేకరించి హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు అతిపెద్ద పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ మార్గంలో డబుల్‌ లైన్‌ బీటీ రోడ్డును అభివృద్ధి చేస్తామని, టూరిస్టు సిటీగా జోడేఘాట్‌ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు.

కొమరం భీమ్

కొమరం భీమ్

గిరిజన వర్సిటీకి భీమ్ పేరే పెడతామన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ వ్యాప్తంగా 500 కళాబృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 20 కళాబృందాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.

కొమరం భీమ్

కొమరం భీమ్

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోడే ఘాట్‌లో కొమరం భీమ్ పేరిట మ్యూజియం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం గురువారం రూ.25 కోట్లు విడుదల చేయనుంది.

కొమరం భీమ్

కొమరం భీమ్

గిరిజనులకు జల్-జమీన్-జంగిల్ కోసం పోరాడిన యోధుడు కొమరం భీమ్ విగ్రహానికి బుధవారం పలు రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతల నివాళులు.

కొమరం భీమ్

కొమరం భీమ్

గిరిజనులకు జల్-జమీన్-జంగిల్ కోసం పోరాడిన యోధుడు కొమరం భీమ్ విగ్రహానికి బుధవారం పలు రాజకీయ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు.

English summary
Telangana CM K Chandrasekhar Rao announced on Wednesday that Adilabad district will be bifurcated and the new district will be named after tribal leader Komaram Bheem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X