ట్రాలీలో తీసుకెళ్తుంటే రోడ్డుపై పడిన విమానం, బోయినపల్లిలో ట్రాఫిక్ జాం (పిక్చర్స్)
హైదరాబాద్: బేగంపేటలోని పాత విమానాశ్రయం రహదారిలో ఆదివారం ఉదటం తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ సాయంతో తరలిస్తున్న చిన్న విమానం అదుపు తప్పి పడిపోయింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మనం విమానాన్ని గాలిలో లేదా విమానాశ్రయాల్లో చూస్తుంటాం. అయితే, శనివారం రాత్రి పాతదైన చిన్న విమానాన్ని రోడ్డు మార్గం ద్వారా షెడ్డుకు తరలించే భాగంలో ఆ విమానం ట్రాలీ నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో రోడ్డుమార్గంలో పడిన విమానాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.
ఈ ఘటన తాడ్‌బంద్ - బోయినపల్లి - ఫిరోజ్ గూడ మధ్యలో జరిగింది. చెడిపోయిన ఆ విమానాన్ని శనివారం నాడు క్రేన్ సహాయంతో ట్రాలీని ఉపయోగించి ఫిరోజ్ గూడలోని షెడ్డుకు తరలించే ప్రయత్నం చేశారు. బేగంపేట పాత విమానాశ్రయం దారిలో దీనిని రోడ్డు మార్గాన తరలిస్తున్నారు.
అయితే, మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాల సమీపంలో ఆ విమానం పక్కకు ఒరిగిపోయింది. దీంతో అక్కడే ఆగిపోయింది. రోడ్డు పైన విమానం పడిపోవడంతో చాలామంది చూసేందుకు తరలి వస్తున్నారు. ఇది శిక్షణా విమానం. దీనిని తొలగించేందుకు మరికొంత సమయం తీసుకోనుంది. ఈ రోడ్డు ట్రాఫిక్ జాం అయింది.

విమానం
బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రమాదం జరిగింది. పాత శిక్షణా విమానాన్ని తరలిస్తుండగా ట్రాలీ నుంచి విమానం జారి పడింది.

విమానం
రోడ్డు మార్గంలో ఫిరోజ్‌గూడలోని షెడ్డుకు తరలించేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాడ్‌బండ్ నుంచి బోయిన్‌పల్లి వరకు మార్గాన్ని అధికారులు మూసివేశారు.

విమానం
విమానం రోడ్డు మధ్యలో పడిపోవడంతో అధికారులు ట్రాఫిక్ మళ్లించారు. ఈ విమానాన్ని ఇటీవల ఎయిర్ షోలోను ప్రదర్శించారు.

విమానం
పాత విమానాన్ని షెడ్డుకు తరలించే ముందు వాటర్ క్యానన్లతో నీళ్లు జల్లారు. గుర్తుగా ఆ విమానంతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఆ తర్వాత విమానాన్ని తరలించే సమయంలో మాత్రం ప్రమాదం జరిగింది.

విమానం
విమానం ట్రాలి నుంచి కిందపడిన నేపథ్యంలో.. ప్లేన్ లిఫ్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ప్రాణనష్టం లేకపోవడం గమనార్హం.

విమానం
బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రమాదం జరిగింది. పాత శిక్షణా విమానాన్ని తరలిస్తుండగా ట్రాలీ నుంచి విమానం జారి పడింది. ఇది జనావాసాలు లేనిచోట పడటంతో ప్రాణాపాయం తప్పింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications