తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే కీలక ప్రకటన - ఉత్తమ్ రాజీనామా..!!

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు. రెండు రోజులుగా కాంగ్రెస్ సీఎం పై హైడ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్ లోనే తెలిపోతుందని భావించినా..ఇప్పుడు సీన్ ఢిల్లీకి చేరింది. రేవంత్ కు సీఎం పదవి ఖాయమని భావిస్తున్నా..సీనియర్ల అభ్యంతరాలతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంటోంది. సీఎం రేసులో ఉన్న భట్టి..ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో కలక మంతనాలు జరగనున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ సీఎం పదవిపై ఖర్గే కీలక ప్రకటన చేసారు.

ఢిల్లీలో మంతనాలు
తెలంగాణలో ముఖ్యమంత్రి అంశం పైన ఢిల్లీలో మంతనాలు సాగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయాధికారం పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏక వ్యాఖ్య తీర్మానం చేసారు. అదే సమయంలో సీనియర్లు తమ పేర్లు సీఎం పదవికి పరిగణలోకి తీసుకోవాలని డీకే శివకుమార్ ను సూచించారు. తాము పార్టీ కోసం ఎంతో కాలంగా చేసిన సేవలను ఏకరువు పెట్టారు. తెలంగాణలో సామాజిక సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. దీంతో, ఇక రేవంత్ ను సీఎంగా ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో సడన్ గా పరిశీలకులను ఢిల్లీ రావాల్సిందిగా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్..భట్టి కూడా ఢిల్లీ చేరటంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

AICC Chief Mallikharjuna Kharge Key announcement on Selecton of Telangana New Chief Minister

వరుస సమావేశాలు
ఇప్పటికే సోనియాతో తెలంగాణ వ్యవహారం పైన ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. తెలంగాణలో పదవుల ఖరారులో సామాజిక న్యాయం పాటించాలని సోనియా సూచించారని సమాచారం. దీంతో. సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్..డిప్యూటీ సీఎం..స్పీకర్..మంత్రి పదవుల పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి విధేయత..సీనియార్టీ..సామాజిక సమీకరణలు ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలని భావిస్తున్నారు. అభ్యంతరాలు ఉన్నవారిని ఒప్పించి నిర్ణయం చేయటం ద్వారా రానున్న రోజుల్లో పార్టీలో విభేదాలు..కొత్త సమస్యలు లేకుండా చూసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

నిర్ణయం పై ఉత్కంఠ
తాజాగా పార్టీ చీఫ్ ఖర్గే తెలంగాణ సీఎం ఎవరో సాయంత్రం లోగా ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేసారు. కాసేపట్లో భట్టి విక్రమార్క, ఉత్తమ్ ఇద్దరూ ఖర్గేను కలవనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. అదే సమయంలో సీఎం రేసులో ఉన్న నేతలు ఢిల్లీలో తమ లాబీయింగ్ ముమ్మరం చేసారు. కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పరిశీలకులతో ఖర్గే సమావేశం తరువాత సీఎం ఎవరనేది పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా మంత్రివర్గ కూర్పు పైనా తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో..ఇప్పుడు ఢిల్లీ పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+