Sharath Babu: విషమంగానే శరత్ బాబు ఆరోగ్యం..

ఆస్పత్రిలో వెంటిలేటర్ పై నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం శరత్ బాబు హెల్త్ బులిటన్ ను హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శరత్ బాబు చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు.. అవయవాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగా లేదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం శరత్ బాబుకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నామని వివరించారు.

శరత్ బాబు కొద్ది రోజులుగా సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారని డాక్టర్లు తెలిపారు. వ్యాధి తిరగబడటంతో ఆయన పరిస్థితి విషమంగా మారిందన్నారు. సెప్సిస్ వ్యాధి ప్రభావం మిగతా అవయవాలపై పడిందన్నారు. లంగ్స్ బాగా దెబ్బతిన్నట్లు వివరించారు. శరత్ బాబు ఆరోగ్యం విషమంగా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.

 Sharath Babu

శరత్ బాబు.. తెలుగు, తమిళ, కన్నడలో 220కిపైగా సినిమాల్లో నటించారు. కథ నాయకుడుగానే కాకుండా విలన్ , తండ్రి పాత్రలు పోషించారు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. కె.ప్రభాకర్, కె.బాబూరావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు సినిమాలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో కీలక పాత్ర పోషించారు.

మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో శరత్ బాబు నటించారు. శరత్ బాబు చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబుు 1974లో రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద. 1988లో విబేధాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1990లో నంబియార్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. 21 ఏళ్ల తర్వాత ఆమెతో కూడా విడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+