శంషాబాద్ లో ఎయిరిండియా విమానాలు రద్దు

ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం పేలింది. దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. దీని ఫలితంగా వెలువడిన బూడిద మేఘాలు భారత్ వైపుగా కదులుతున్నాయి. ఈ బూడిద మేఘాలు ఉత్తరాది రాష్ట్రాలను అలుముకోనున్నాయి. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దీని ప్రభావం కనిపించింది కూడా. ఈ తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు మరింత దట్టమైన బూడిద ఢిల్లీ గగనతలానికి చేరుకోవచ్చనే వాతావరణ నిపుణులు అంచనావేశారు.

ఈ విస్ఫోటనం వల్ల 10-15 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీ బూడిద గాల్లోకి ఎగిసింది. సల్ఫర్ డయాక్సైడ్ తో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోను స్పుట్నిక్ ఆఫ్రికా విడుదల చేసింది. దాదాపు 10,000 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం ఇది. ఆదివారం మొదటిసారిగా విస్ఫోటనం చెందింది. దీనివల్ల దట్టమైన బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి ఎగజిమ్మాయి. మేఘాలు ఏర్పడ్డాయి.

Air India Flight Cancellations including Hyderabad After Ethiopian Hayli Gubbi Volcanic Eruption

వాతావరణ ట్రాకర్ల అంచనాల ప్రకారం- ఈ బూడిద మేఘాలు మొదట పశ్చిమ రాజస్థాన్ మీదుగా భారత్ లోకి ప్రవేశించాయి. జోధ్‌పూర్, జైసల్మేర్ మీదుగా భారత ఉపఖండాన్ని కమ్ముకుంటోన్నాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం వైపు కదులుతున్నాయని ఇండియా మెట్ స్కై వెదర్ హెచ్చరించింది. ఈ బూడిద మేఘాలు 25,000 నుండి 45,000 అడుగుల ఎత్తులో ఆవరించి ఉన్నాయని, ఈ కారణంగా ఆకాశం వింత మెరుపులతో మెరిసిపోయే అవకాశం ఉందని మెట్ స్కై వెదర్ ట్రాకర్ తెలిపింది.

కాగా- ఈ మేఘాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాలను తీసుకుంది. నోతం, యాష్ టం జారీ చేసింది. కొచ్చి-దుబాయ్ ఇండిగో, కొచ్చి-జెడ్డా ఆకాశ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్-ఢిల్లీ విమాన సర్వీసును రద్దు చేసినట్లు కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. తాజాగా ఎయిరిండియాకు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. ఈ జాబితాను ఎయిరిండియా యాజమాన్యం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన/చేరుకోవాల్సిన విమానాలూ ఈ జాబితాలో ఉన్నాయి.

AI 106- నెవార్క్- ఢిల్లీ

AI 102- న్యూయార్క్ (జాన్ ఎఫ్ కెన్నడీ)- ఢిల్లీ

AI 2204- దుబాయ్- హైదరాబాద్

AI 2290- దోహా- ముంబై

AI 2212- దుబాయ్- చెన్నై

AI 2250- దమ్మం- ముంబై

AI 2284- దోహా- ఢిల్లీ విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి.

AI 2822- చెన్నై- ముంబై

AI 2466- హైదరాబాద్- ఢిల్లీ

AI 2444/2445- ముంబై- హైదరాబాద్- ముంబై

AI 2471/2472- ముంబై- కోల్ కతా- ముంబై

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+