నాన్న కోసం ఎదురు చూపులు చూసిన అల్లు అర్హ: జైలు నుంచి విడుదల..!!

Allu Arjun arrest: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన భారీ బందోబస్తు మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు శుక్రవారం సాయంత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ- విడుదల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల రాత్రంతా జైలులో గడపాల్సి వచ్చింది.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ సంధ్య థియేటర్‌ వద్ద భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ దుర్మరణం పాలయ్యారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను కారకుడిగా పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను అరెస్టు చేశారు.

Allu Arjun released from the jail after getting interim bail

అల్లు అర్జున్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఎఫ్ఐఆర్ పెట్టారు. భారత్ న్యాయసంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ అయింది. తొలుత ఆయనను నాంపల్లి కోర్టు సమక్షానికి ప్రవేశపెట్టారు. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది జీ అశోక్ రెడ్డి తన వాదనలను వినిపించారు.

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలతో రేవతి మృతిచెందడం, దీనికి కారకుడిగా అల్లు అర్జున్‌‌ను పేర్కొంటూ అరెస్ట్ చేయడం వంటి పరిణామాలను వివరించారు. వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించారు. దీనితో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అదే సమయంలో బెయిల్ కోసం అల్లు అర్జున్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్ రెడ్డి వాదనలను వినిపించారు. ఆయనపై నమోదు చేసిన 105 (బీ), 118 (1) సెక్షన్ల వర్తించబోవని పేర్కొన్నారు. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉన్నప్పటికీ.. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొనలేమని వ్యాఖ్యానించారు.

వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. శుక్రవారం సాయంత్రమే బెయిల్ లభించినప్పటికీ.. విడుడల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. ఫలితంగా ఆయన రాత్రంతా చర్లపల్లి జైలులోనే గడపాల్సి వచ్చింది. దీనిపై న్యాయవాది జీ అశోక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అక్రమంగా నిర్బంధించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

అల్లు అర్జున్ కుటుంబం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. ఊహించిన విధంగా ఈ అరెస్ట్ చోటు చేసుకోవడం, బెయిల్ లభించినప్పటికీ అప్పటికప్పుడు విడుదల కాకపోవడం, జైలులో గడపాల్సి రావడం వల్ల అల్లు అరవింద్, భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కుమార్తె అర్హ నిరాశకు లోనయ్యారు. ఈ తెల్లవారు జామున తండ్రి వస్తోన్నాడని తెలిసి అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంటి ముందు ఎదురు చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+