కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఆమ్రపాలికి షాక్ తగిలింది!!
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గాడి తప్పిన పాలన పైన సోషల్ మీడియా వేదికగా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్యం గాడిదప్పిందని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అసహనం వ్యక్తం చేసిన ఆయన పోస్టులో రేవంత్ పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.
సిటీలో ఎక్కడ చూసిన చెత్త కుప్పలే : కేటీఆర్
సిటీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని, సిటీలో దాదాపు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదంటూ వెల్లడించారు. హైదరాబాద్ నగరం అధ్వాన్నంగా తయారైందని , బస్తీలు, కాలనీలలో వ్యర్ధాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ లో చెత్త తరలింపు కేవలం కాగితాలలో మాత్రమే కనిపిస్తుంది అంటూ వెల్లడించారు.

పార్ట్ టైం మంత్రి రేవంత్ అంటూ టార్గెట్
మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతున్నదని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన పార్ట్ టైం మున్సిపల్ మంత్రేమో.. ఎమ్మెల్యేలకు కొనుగోళ్లపైన ఢిల్లీలో బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడాలని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఆమ్రపాలి కాటాకు షాక్
కేటీఆర్ తన ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసినా జిహెచ్ఎంసి కమిషనర్ గా అధికారులను ఉరుకుల పరుగులు పెట్టిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న ఆమ్రపాలి కాటాకు షాక్ తగిలింది. నగరంలో పారిశుధ్యం పైన కేటీఆర్ చేసిన ట్వీట్ ఆమ్రపాలి పని తీరును ప్రశ్నిస్తుంది.
జీహెచ్ఎంసీ పనితీరుపై కేటీఆర్ వ్యాఖ్యలతో ఆమ్రపాలిపై చర్చ
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభిస్తున్నాయని కేటీఆర్ చేసిన పోస్ట్, భాగ్యనగరంలో చెత్తాచెదారం ఎక్కడికక్కడే పేరుకుపోయిందని కేటీఆర్ పెట్టిన పోస్టులతో చర్చ జరుగుతుంది. రేవంత్ సర్కార్ ఎంతో నమ్మకంతో జీహెచ్ఎంసీ బాధ్యతలను ఆమ్రపాలికి అప్పగించారు. కానీ తాజా విమర్శలతో గ్రేటర్ హైదరాబాద్ ను పరిశుభ్రంగా మార్చేందుకు ఆమ్రపాలి కాటా ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
-
"నేను డ్రగ్స్ టెస్ట్ కు రెడీ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను" -
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 20న బడ్జెట్..? -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications