వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత్ అంబానీ స్లిమ్‌గా అవడం వెనకున్న ఆ తెలుగు వ్యక్తి ఇతడే

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: అనంత్ అంబానీ... ఇటీవల కాలంలో బరువు తగ్గాలనుకునే యువతకు ఓ రోల్ మోడల్. ఎందుకంటే గతంలో అధిక బరువుతో కొండలా కనిపించే ఆయన.. ఇప్పుడు ఎంతో సన్నబడి స్మార్ట్‌గా కనిపించడమే ఇందుకు కారణం. అయితే అనంత్‌ అంబానీ విజయం వెనుక ఓ తెలుగు యువకుడి కృషి ఎంతో ఉంది.

అనంత్ అంబానీ తర్వాత.. సన్నబడిన ఫడ్నవీస్

అతనెవరో కాదు వినోద్‌ చెన్నా. బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారుండరు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు జాన్‌ అబ్రహం నుంచి శిల్పాశెట్టి వంటి వారు ఈయన వద్ద ట్రైనింగ్‌ పొందినవారే. 180 కేజీల బరువున్న అనంత్ అంబానీని కేవలం 18 నెలల్లోనే 108 కేజీలు ఎలా తగ్గించాలో ఆయన వివరించారు.

Anant Ambani’s trainer reveals the workout routine and diet plan that led to the epic weight loss

అనంత్ అంబానీ ఒకప్పుడు 208 కిలోల శరీర బరువుతో తీవ్ర ఇబ్బంది పడేవాడు. దీంతో బాడీ ట్రాన్సఫర్మేషన్‌ మొదటి దశలో భాగంగా అనంత్‌ ఆహారపు అలవాట్లు, అధిక బరువుతో వచ్చే సమస్యలపై దృష్టి పెట్టమన్నారు. అధిక బరువుని అధిగమించేందుకు అతికష్టం మీద కొన్ని అలవాట్లను, ఆహారపు శైలిని మార్చానని చెప్పారు.

ముఖ్యంగా అనంత్ అంబానీ తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్‌, తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్లు ఉండేట్లు చూశానని అన్నారు. దీనిలో భాగంగా కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, కాటేజ్‌ చీజ్‌, కాయధాన్యాలు, పప్పులు, అరటీస్పూన్‌ నెయ్యి తీసుకునేలా చేశానని చెప్పారు.

ఇలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అనంత్ శరీరానికి రోజుకు 1200-1400 కేలరీలు మాత్రమే అందేట్లు చూశానని అన్నారు. అంతేకాదు జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేశాసేలా చేశామన్నారు. ఇక
నిత్యం 30 నిమిషాల నుంచి 2గంటల వరకు నడక ఉండేదన్నారు.

Anant Ambani’s trainer reveals the workout routine and diet plan that led to the epic weight loss

దీంతోపాటు రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఛాతీకి, పిక్కలకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేయించేవారమని చెప్పారు. అయితే ఈ వ్యాయామాల్లో కొన్నింటిని అనంత్ చేయడానికి తొలుత ఇబ్బంది పడిన మాట వాస్తమేనని అన్నారు. ఆ తర్వాత వీటికి అలవాటు పడటంతో 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గి 208 కిలోల నుంచి 100 కిలోలకు చేరుకున్నాడని తెలిపారు.

అయితే అనంత్ అంబానీని అధిక బరువు నుంచి స్లిమ్‌గా తీసుకొచ్చేందుకు తనతో పాటు డాక్టర్‌ ఆండ్రీ చిమోన్‌ సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. రోజుకు 5- 6 గంటలు పాటు వ్యాయామం చేయించేవారమని తెలిపారు. అలాగే ప్రతిరోజూ 21 కిలోమీటర్లు నడక సాగించేవాడు.

యోగాతో పాటు అధిక తీవ్రత ఉన్న గుండెకు సంబంధించిన వ్యాయామాలు యానిమల్‌ ఫ్లో వర్కవుట్స్‌, మెడిసిన్‌ బాల్‌ వర్కవుట్స్‌, వెయిట్‌ ట్రైనింగ్‌, కలరిపయట్టు వంటి యుద్ధ విద్యలు, స్పోర్ట్స్‌ కండిషనింగ్‌ వర్కవుట్స్‌, బ్యాలెన్స్‌ ట్రైనింగ్‌, టీఆర్‌ఎక్స్‌ బాండ్‌ ట్రైనింగ్‌ వంటివి చేశావడని తెలిపారు.

అనంత్ ఇలా మారడం కోసం అతడి తల్లి నీతా అంబానీ అన్ని దగ్గర ఉండి చూసుకున్నారు. అనంత్ చిన్నతంలో ఆస్తమాతో బాధపడేవాడు. ఆ సమయంలో వాడిన మందుల వల్ల భారీ స్థూలకాయం వచ్చింది. ఇదే రీతిలో ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించడంతో తన అధిక బరువుని తగ్గించుకున్నారు.

కాగా వినోద్‌ చెన్నా విషయానికి వస్తే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఒక్క పూట కూడా పాలు తాగలేని ఆర్ధిక పరిస్థితిలో ఉండేవాడు. బాగా సన్నగా ఉండే వినోద్‌ మంచి శరీర సౌష్ఠవాన్ని సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. దీంతో కళాశాలలో చదివేటప్పుడే ఉద్యోగంలో చేరి తన ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని సంపాదించాడు.

ఇందులో కొంత మొత్తాన్ని ఇంటి అవసరాలకు ఇచ్చి మగిలింది తన వ్యాయామాలు చేయడం కోసం ఖర్చు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో మిస్టర్‌ ముంబై, మిస్టర్‌ గుర్గావ్, మిస్టర్‌ మహారాష్ట్ర రన్నరప్‌ వంటి టైటిళ్లను సాధించాడు. తర్వాత కె-11 అకాడమీ నుంచి ప్రొఫెషనల్‌ ట్రైనర్‌గా పట్టాపొందాడు.

మల్టీచైన్‌ జిమ్‌ తల్వాకర్స్‌లో ట్రైనర్‌గా కెరీర్‌ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం వీసీ ఫిట్‌నెస్‌ పేరుతో జిమ్‌లను నిర్వహిస్తున్నాడు. మెన్స్‌ హెల్త్‌ పత్రిక వినోద్ చెన్నాను బెస్ట్‌ ట్రైనర్‌ ఆఫ్‌ ఇండియాగా పేర్కొంది.

English summary
Anant Ambani's epic weight loss is astonishing and reads like a story out of a before-and-after weight loss advertisement. But it was not as simple as it sounds. From weighing 208 kilos to 100 kilos now, a staggering loss of 108 kilos and that too within 18 months, reveals the amount of hardwork and dedication a person has put in to get back into shape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X