షూటింగ్ బిజీ, టైం అడిగిన ప్రదీప్, ఒప్పుకోవడం మంచిదే: తప్పును అంగీకరించి 'నిలబెట్టుకున్నాడు'!
Recommended Video

హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి మద్యం తాగి పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వీడియో పోస్ట్ చేయడంతో విషయం కొలిక్కి వచ్చింది. ఆయన అజ్ఞాతంలో ఉన్నారని, పరారీలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ముందుగా తాను అంగీకరించిన కాల్షీట్ల మేరకే తాను బిజీగా ఉన్నానని ప్రదీప్ వీడియోలో చెప్పడంతో పాటు, తాను తప్పు చేశానని, తనలా మరెవరూ తప్పు చేయవద్దని కోరారు. మరోవైపు, ప్రదీప్ కౌన్సెలింగ్‌కు శుక్రవారం హాజరు అయ్యే అవకాశముందని తొలుత భావించారు. ఆయన హాజరు కావడానికి ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన డెడ్ లైన్ ఇదే. ఆయన విజ్ఞప్తి మేరకు పొడిగించారు.

కౌన్సెలింగ్‌కు వచ్చే అవకాశం
ఆయన వీడియో విడుదల చేసి తప్పును అంగీకరించడాన్నిబట్టి చూస్తుంటే బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశముంది. అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. ఇదిలా ఉండగా,ప్రదీప్ షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నందున మరో రెండు రోజుల సమయం కావాలని అభ్యర్థించినట్లు ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్ కాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. ప్రదీప్ కుటుంబ సభ్యులతో కలిసి తప్పనిసరిగా కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సిందే అన్నారు. లేదంటే ఛార్జిషీట్ నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. ఇకనుంచి సెలబ్రిటీలను ట్రాఫిక్ అవగాహన ప్రచారానికి వినియోగించే సమయంలో వారి ఆహారపు అలవాట్లను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. తాను మద్యం సేవించి వాహనం నడపడం తప్పేనని ప్రదీప్ ఒప్పుకోవడం మంచి పరిణామమన్నారు.

వీడియో పెట్టి అభిమానులను ప్లాట్ చేసిన ప్రదీప్
ఇదిలా ఉండగా, వీడియో పెట్టడం ద్వారా ప్రదీప్ హుందాగా వ్యవహరించినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. ఆయన వీడియోకు చాలామంది స్పందించారు. ఆయన వీడియో పోస్టుకు కామెంట్లు పెట్టారు. ఎవరూ కూడా పర్‌ఫెక్ట్ కాదని, అందరూ తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దుకున్నారంటూ ఆయనకు పోస్టులు పెట్టారు.

తప్పును అంగీకరించడంతో
తప్పును అంగీకరించడం ద్వారా మీ పైన అభిమానం మరింత పెరిగిందని ప్రదీప్‌కు పెట్టిన పోస్టులో అభిమానులు అభిప్రాయపడ్డారు. అది పెద్ద తప్పు కాదని, కానీ చట్టరీత్యా అది పెద్ద తప్పు అని, అయితే తాను చేసిన తప్పుకు ప్రదీప్ స్పందించిన తీరు బాగుందని అంటున్నారు.

గంటల్లోనే వేలాదిమంది స్పందన
ప్రదీప్ వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే వేల లైకులు, వేలాది మంది స్పందన, పెద్ద ఎత్తున ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది. ప్రదీప్ తప్పును సరిదిద్దుకున్నాడని, అందుకు మా మద్దతు ఉంటుందని అభిమానులు పోస్టులు పెట్టారు. ప్రదీప్ తాను చేసిన తప్పుపై మౌనంగా ఉన్నా ఆయన ఇమేజ్‌కు నష్టం జరిగేదని, తప్పు సరిదిద్దుకుంటాని వీడియో పెట్టడం ద్వారా హుందాగా వ్యవహరించి అభిమానం రెట్టింపయ్యేలా చేసుకున్నాడని అంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications