చిలుకానగర్ నరబలి: విస్తుపోయే విషయం, క్షుద్రపూజల్లో భార్య వీరంగం
హైదరాబాద్: ఉప్పల్‌లోని చిలుకానగర్ నరబలి కేసులో మరో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. కుట్రలు, కుతంత్రాలు చేసినా నిందితుడైన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఓ చోట దొరికిపోయాడు.
Recommended Video

క్షుద్రపూజలు చేస్తుండా తంతును తన ఫోన్‌లో రికార్డు చేశాడు. తర్వాత దాన్ని డీలిట్ చేయడం మరిచిపోయాడు. ఆ ఆడియో రికార్డు కేసును ఛేదించడంలో పోలీసులకు కీలకంగా మారింది.

రాజశేఖర్ ఇలా దొరికాడు
ఉప్పల్ నరబలి కేసులో పోలీసులు రాజశేఖర్ ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అందులో ఆడియో టేపులను పరిశీలిస్తుండగా వాటిలో ఒకటి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అందులో మాటలను బట్టి విషయాన్ని అర్థం చేసుకున్నారు.

శ్రీలతను చీపురుతో కొడుతున్నట్లు...
ఆడియోలోని మాటలను బట్టి రాజశేఖర్ భార్య శ్రీలతను చంద్రగ్రహణం రోజు కొందరు మంత్రగత్తేలు పూజలో కూర్చోబెట్టి తాయితులు కట్టిన చీపురుతో కొడుతున్నట్లు అర్థమైంది. ఆ క్రమంలో శ్రీలత చేసిన వీరంగం, ఆమె పలికిన మాటలు కూడా కేసును ఛేదించడానికి పనికి వచ్చాయి.

నేను లచ్చవ్వనురా, వదలను
నేను లచ్చవ్వనురా, ఒరేయ్ రాజశేఖర్ .. నిన్ను వదల.. నీ కుటుంబాన్నీ వదల.. సర్వనాశనం చేస్తానురా అంటూ శ్రీలత వీరంగం వేసింది. ఆ ఆడియో ఆధారంగా పోలీసులు రాజశేఖర్‌ను విచారించారు. దాంతో చిన్నారిని బలి ఇచ్చింది తానే అని అంగీకరించాు.

యూవీ టెక్నాలజీ ద్వారా.
చిన్నారి రక్తం మరకలు కనిపించకుండా రాజశేఖర్ ఇల్లంతా శుభ్రం చేశాడు. అయితే, ఫోరెన్సిక్ నిపుణులు యూవీ టెక్నాలజీ ద్వారా ఇంట్లోని ప్రతి అంగుళాన్నీ పరిశీలించారు. ఒక చోట టైల్స్ మధ్యలోకంటికి కనిపించని స్థాయిలో ఉన్న రక్తం మరకను గుర్తించారు. చిన్నారి తనల నుంచి సేకరించిన రక్తనమూనాలతో డిఎన్ఎ పరీక్ష నిర్వహించారు. దాంతో రెండో ఒక్కటేనని తేలింది. క్షుద్రపూజలు చేసిన కోయ మంత్రగాళ్లను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications