సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేడు . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేడు జన్మదినం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డికి చంద్రబాబు విషెస్
అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

AP CM Chandrababu Deputy CM Pawan Kalyan special wishes for CM Revanth Reddy

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిందిదే
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆయన ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

ఒకేఒక్కడు రేవంత్ రెడ్డి
మీరు ఆరోగ్యం మరియు దీర్ఘాయువుతో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చే శక్తి పొందాలని అభిలషిస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.ఇదిలాఉంటే సీఎం రేవంత్ రెడ్డి విలక్షణ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడుతున్నారు. రేవంత్ రెడ్డిపై ప్రముఖ రచయిత వేణుగోపాల్ రెడ్డి రచించిన ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి అనే పుస్తకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు.

రాజకీయాలలో డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి
చిన్నవయసులోనే రాజకీయాలలో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధ పాలన చేసిన కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+