అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వేళ సినీ - రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. జైలు నుం చి విడుదల అయిన అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. బన్నీ ని పరామర్శించారు. అరెస్ట్ సమయంలో బన్నీ హుందాగా వ్యవహరించారని...ఆ తరువాత స్పందించి
న తీరును అభినందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, నాగబాబు బన్నీ నివాసానికి వెళ్లారు. ఇక, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో, సినీ ఫ్యాన్స్ లో వార్త పైన ఆసక్తి కనిపిస్తోంది.
అల్లు అర్జున్ కోసం
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమంది. ఆ తరువాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ కు పంపింది. ఇటు హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటీషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ తరు వాత అల్లు అర్జున్ కు బెయిల్ దక్కిం. కానీ, విడుదల ప్రాసెస్ ఆలస్యం కావటంతో అల్లు అర్జున్ దాదాపు 13 గంటలు జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయి ఇంటికి వచ్చిన తరువాత ఉద్విగ్న వాతావరణం కనిపించింది. అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలి వచ్చారు.

సినీ ప్రముఖుల మద్దతు
కాగా, ఈ విషయంలో పలువురు రాజకీయ ప్రమఖులు అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో ఫోన్ లో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పు బట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ సరి కాదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు చట్టం తన పని తాను చేసుకుందని..ఇందులో ఎలాంటి వివాదం లేదని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత రేవతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శిస్తానని వెల్లడించారు. పుష్ప మూవీ మేకర్స్ ఆస్పత్రిలో తేజను పరామర్శించారు.
ఏం జరుగుతోంది
ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉందని సమాచారం. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలలో శిల్పా రవి ఇంటికి వెళ్లటం..తరువాతి పరిణామాలతో మెగా ఫ్యాన్స్ కొందరు అల్లు అర్జున్ పైన ఆగ్రహంతో ఉన్నారు. పుష్ఫ -2 విడుదల సమయంలోనూ సోషల్ మీడియా వేదికగా ఈ గ్యాప్ స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ అరెస్ట్ పైన పవన్ ఇప్పటి వరకు ఓపెన్ గా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారనే ప్రచారం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications