హోటల్స్ లో బిర్యానీలు తెగ తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!
హోటళ్ళు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లలో బిర్యానీలు తింటున్నారా? అయితే మీరు ఒక్క నిమిషం ఆగాల్సిందే.. మీరు తింటున్న బిర్యాని మంచిదేనా? అది ఎటువంటి కల్తీ లేని మంచి వనస్పతి తో, నూనెతో తయారు చేసిందేనా? అనేది ప్రస్తుతం ఆలోచించాల్సిన పరిస్థితి. సహజంగా బిర్యానీకి మంచి వాసననుమంద, రుచిని జోడించడం కోసం నెయ్యి ఉపయోగిస్తారు.
జంతువుల వ్యర్ధాల నుండి వనస్పతి
బిర్యానీ తయారీకి కూడా నెయ్యిని గాని, నూనెను గాని ఉపయోగిస్తారు. అయితే చాలా చోట్ల బిర్యానీ తయారీకి ఉపయోగించే వనస్పతి జంతువుల వ్యర్థాలతో తయారుచేస్తున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలోని పరకాలలో వందల కిలోల వనస్పతి పట్టు పడడం ఇందుకు ఉదాహరణ. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో జంతువుల వ్యర్థాల నుంచి వనస్పతి తీస్తున్న ముఠాను పరకాల పోలీసులు పట్టుకున్నారు.

పరకాలలో జంతు వ్యర్దాలతో వనస్పతి తయారుచేస్తున్న గ్యాంగ్
హన్మకొండ జిల్లా పరకాల లోని మాచారం కాలనీకి చెందిన మస్తాన్, అంబేద్కర్ రాజంపేట ఏరియాకు చెందిన మెహబూబ్, సలీమ్ లు చాలా కాలంగా జంతువుల వ్యర్థాలతో వనస్పతి తయారు చేస్తున్నారు. వీటిని 15 కిలోల తో కూడిన రేకుల డబ్బాలలో నింపి భద్రపరుస్తున్నారు. ఒక్కో డబ్బాకు 530 రూపాయలు తీసుకుని విక్రయాలు సాగిస్తున్నారు.
జంతు వ్యర్థాల వనస్పతి సీజ్.. వాళ్ళు పోలీసుల అదుపులో
వరంగల్ మండి బజార్ కు చెందిన ఒక వ్యాపారి వారానికి రెండు సార్లు రాత్రి వేళల్లో పరకాలకు వచ్చి వనస్పతిని తీసుకు వెళుతున్నారని, వరంగల్లో ఉన్న బిర్యానీ పాయింట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లకు దీనిని అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు జరిపిన పరకాల పోలీసులు మొత్తం 28 డబ్బాల వనస్పతి ని సీజ్ చేసి తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలంగాణా వ్యాప్తంగా బిర్యానీలలో జంతు వ్యర్ధాల వనస్పతి .. జాగ్రత్త
హనుమకొండ, వరంగల్ లో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జంతువుల వ్యర్ధాల తోటి వనస్పతి ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ముఖ్యంగా బిర్యానీకి ఫేమస్. అటువంటి హైదరాబాద్, తెలంగాణ బిర్యాని ఈ విధంగా జంతువుల వ్యర్ధాలతో కూడిన వనస్పతి తో కల్తీ అవుతుంది అంటే కాస్త ఆలోచించవలసిందే. ప్రతిరోజు బిర్యానీ లేనిదే ముద్ద దిగని వారు వ్యర్థాలతో తయారుచేస్తున్న బిర్యానీలను తింటే అనారోగ్యం పాలు అవుతామనే విషయాన్ని తప్పక గుర్తించాలి.
-
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్‌కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications