మోరంచపల్లిలో రంగంలోకి ఆర్మీ హెలికాఫ్టర్లు.. పునరావాస కేంద్రాలకు గ్రామస్తుల తరలింపు!!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగి పొర్లడంతో వరద ముంపుకు గురైన మోరంచపల్లి గ్రామస్తులను ఎట్టకేలకు సహాయక సిబ్బంది రక్షిస్తున్నారు. మోరంచ వాగు ఉప్పొంగి దాదాపు 15 అడుగుల మేర వరద నీరు మోరంచ పల్లి వద్ద ప్రవహించడంతో మొత్తం మోరంచపల్లి గ్రామం వరద ముంపుకు గురైంది.

భారీ వర్షాల దెబ్బకు మోరంచ వాగు ఉధృతి తో భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. దీనితో 353సీ జాతీయ రహదారి పై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మోరంచపల్లి గ్రామస్తులందరూ జలదిగ్బంధంలో చిక్కుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ఈరోజు తెల్లవారేసరికి బయటకు వెళ్లలేని పరిస్థితిలో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో గ్రామస్థులు తమను కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

armyhelicoptersrescueoperationinmoranchapally1

మోరంచపల్లి వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపారు. ఏదైనా ఎత్తుగా ఉన్న ఇళ్ళపైకి, చెట్ల పైకి ఎక్కి సహాయం కోసం అర్థించారు. దీంతో కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో మోరంచపల్లి వాసులను కాపాడడానికి పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవిన్యూ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత వారిని కాపాడడానికి బోట్ల ద్వారా గ్రామస్తులు తరలింపు ప్రక్రియ చేపట్టారు.

అయితే వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. దీంతో వేగంగానే గ్రామస్తుల తరలింపు ప్రక్రియ సాగింది. ఇప్పటివరకు 70 మందిని రక్షించామని, దాదాపు గ్రామాన్ని ఖాళీ చేస్తున్నామని ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు.

మోరంచపల్లి గ్రామ జనాభా 1000 మంది కాగా వారిని యుద్ధ ప్రాతిపదికన తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ముంపులో చిక్కుకున్న గ్రామం నుండి గ్రామస్తులను బయటకు తీసుకు వచ్చిన తర్వాత వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వసతి, భోజనం సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రస్తుతం ఆందోళన మరింత ఎక్కువైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+