టోలిచౌకీ పిలగాడు.. రాజమౌళినే పడగొట్టాడు

కొలంబో: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్ చెలరేగింది. శ్రీలంక జట్టుకు సొంత గడ్డపై చుక్కలు చూపింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం అనే నిర్ణయం ఎంత పొరపాటో ఆ జట్టు కేప్టెన్‌కు తెలిసి వచ్చేలా చేసింది. టీమిండియా బౌలర్ల పరాక్రమం ముందు లంక జట్టు 50 పరుగులకే కుప్పకూలింది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్స్‌లో టాస్ గెలిచింది శ్రీలంక. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు ఆ జట్టు కేప్టెన్ డాసన్ శనక. ఈ నిర్ణయంతోనే సగం మ్యాచ్ ఓడిపోయినట్టయింది. ఏ దశలో కూడా ఆ జట్టు కోలుకోలేకపోయింది. వరుస బెట్టి వికెట్లను నష్టపోయింది.

Asia Cup 2023, IND vs SL: Director Rajamouli praised Siraj

తొలి ఓవర్ నుంచే లంక పతనం ఆరంభమైంది. తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ కుశాల్ పెరీరా అవుట్ అయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాతి వంతు మహ్మద్ సిరాజ్‌ది. ఒకే ఓవర్‌లో అంటే ఆరు బంతుల్లో నలుగురు లంక బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించాడు.

ఇన్నింగ్ నాలుగో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ పాథుమ్ నిశ్శంకను బలి తీసుకున్నాడు సిరాజ్. మూడో బంతికి సదీర సమరవిక్రమ ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి స్టార్ బ్యాటర్ అసలంక డకౌట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద పడ్డ ఫుల్లర్‌ను షాట్ ఆడబోయి కవర్స్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్ ఆరోబంతికి ధనంజయ డిసిల్వను అవుట్ చేశాడు.

ఆ తరువాత కూడా సిరాజ్ విశ్వరూపం ఆగలేదు. ఇన్నింగ్ ఆరో ఓవర్ నాలుగో బంతికి డాసన్ శనక వికెట్లను నేలకూల్చాడు. సిరాజ్ వేసిన ఫుల్లర్‌ను అర్థం చేసుకోలేకపోయాడు శనక. ఆడాలా? వద్దా? అంటూ తికమకపడ్డాడు. బ్యాట్ అడ్డు పెట్టడం ఆలస్యం చేశాడు. ఆఫ్ స్టంప్‌ను గాల్లోకి ఎగరగొట్టిందా బంతి. 12 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది లంక.

ఇక ఏ దశలో కూడా ఆ జట్టు కోలుకోలేదు. జట్టు మొత్తానికీ ఇద్దరు బ్యాటర్లే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. పాథుమ్ నిశ్శంక-2, కుశాల్ పెరీరా-0, కుశాల్ మెండీస్- 17, సదీర సమరవిక్రమ- 0, చరిత్ అసలంక-0, ధనంజయ డిసిల్వా- 4, డాసన్ శనక- 0, దునిత్ వెల్లాలగె- 8, దుషాన్ హేమంత- 13 నాటౌట్, ప్రమోద్ మదుషాన్- 1, మతీషా పతిరాన-5 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో సగానికి పైగా వికెట్లను నేలకూల్చాడు హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. ఏడు ఓవర్లల్లో 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా-3, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ఈ డ్రీమ్ స్పెల్‌తో సిరాజ్ పేరు మార్మోగిపోతోంది. ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫీగర్స్. 6/21 అనేది ఆసియా కప్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్.

మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌కు దిగ్దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఫిదా అయ్యాడు. అతని బౌలింగ్ స్పెల్‌ను అభినందించకుండా ఉండలేకపోయాడు. శ్రీలంక ఇన్నింగ్ ముగిసిన వెంటనే ట్విట్టర్‌కు పని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్‌లో మా టోలిచౌకీ పిల్లాడు.. ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. అంటూ ట్వీట్ చేశాడు. తన బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా మిడాన్ దిశగా కొట్టిన షాట్‌ను ఆపడానికి సిరాజ్ ప్రయత్నించడం ముచ్చటేసిందని కామెంట్స్ పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+