కేసీఆర్ జైలుకు వెళ్లబోతున్నాడు: వేణుస్వామి

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలను చెబుతుంటాడు. ఇలా చెబుతూ చెబుతూ తాను కూడా కొద్దికాలానికి ఓ పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. వాస్తవానికి ఆయన చెప్పినవాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. జరగనవైతే లెక్కబెట్టలేనంత ఉంటాయి. తాజాగా ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి జాతకం చెప్పారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామిని యాంకర్ కేసీఆర్ గురించి ప్రశ్నించారు. ఇప్పటివరకు క్లీన్ పాలిటిక్స్ చేసిన ఆయన ఎలా అరెస్ట్ అవుతారని అడిగారు. ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనేది తాను చెప్పలేనని, కేసీఆర్ మాత్రం తప్పకుండా జైలుకు వెళతాడన్నారు. కొంచెం ఆలస్యమైనప్పటికీ కేసీఆర్ మాత్రం జైలు జీవితం గడపక తప్పదన్నారు. గతంలో లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారని వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఇటీవలే ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.

Astrologer Venuswamy said that KCR is going to jail soon

చంద్రబాబునాయుడు, కేసీఆర్ కూడా జైలు జీవితం గడపాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వంతు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలతోపాటు వివిధ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దీనిప్రకారం చూస్తే కేసీఆర్ కూడా త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశం ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం కవిత అరెస్ట్ పై న్యాయ పోరాటం చేయడానికి కేటీఆర్ సమాయత్తమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+