బాలికతో అసభ్య ప్రవర్తన.. అటెండర్‌కు దేహశుద్ది
గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో అటెండర్ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో టెంపరరీ అటెండర్‌గా పనిచేస్తున్న సర్వర్ అనే వ్యక్తి దారి తప్పాడు. అదే స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఎలాగోలా ఆ నరరూప రాక్షసుడి బారి నుంచి తప్పించుకున్న సదరు బాలిక ఇంటికి వెళ్లాక.. అటెండర్ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో ఓపిక పట్టారు. సోమవారం నాడు ఉదయం ఆ చిన్నారి పేరెంట్స్ తో పాటు కాలనీవాసులు స్కూల్‌కు వెళ్లి అటెండర్ ను నిలదీశారు. అనంతరం దేహశుద్ది చేశారు. హెడ్ మాస్టర్ స్వరూప్‌చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ కు వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అటెండర్ సర్వర్ గతంలోనూ ఇలాగే ప్రవర్తించినట్లు తమ కూతురు చెప్పిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే అప్పుడు భయపడి ఆ విషయం తమతో చెప్పలేదని తెలిపారు. శనివారం నాడు వెకిలి చేష్టలు వేయడంతో స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చిందని.. ఏమైందని ఆరా తీయడంతో జరిగిన విషయం చెప్పిందన్నారు.
పిల్లలను చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు స్థానిక విద్యార్థి సంఘాల నేతలు. అటెండర్ తీరుకు నిరసనగా స్కూల్ ఎదుట ఎమ్మార్పీఎస్ నేతలు ధర్నా చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications