ఆడియో వైరల్: సీఐకు జెడ్పీ చైర్ పర్సన్ భర్త బెదిరింపులు.. ఆ ఎస్సై గురించే..
పోలీసులను నేతలు బెదిరించడం పరిపాటే అయ్యింది. ఏదో వంకతో థ్రెట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియో/ వీడియోలు బయటకు వస్తున్నాయి. గద్వాల్ సీఐ హనుమంతు.. జెడ్పీ చైర్ పర్సన్ భర్త తిరుపతయ్య ఆడియో కాల్ కలకలం రేపింది. అందులో ఎస్సై గురించి తిరుపతయ్య బూతులు మాట్లాడారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. ఇదీ ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ, శనివారం మాత్రం ఆడియో వైరలయ్యింది. అందులో తిరుపతయ్య సీఎం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు.
హనుమంతు గద్వాల్ సీఐగా పనిచేశాడు. పలు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. హనుమంతుతో జెడ్పీ చైర్‌పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తి గతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారానికి సంబంధించి కేసు విషయంలో తిరుపతయ్య.. హనుమంతుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో బూతులు కూడా తిట్టారు.

గట్టు ఎస్సై, స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్సైకి ఉద్యోగం ఎందుకు అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేయాలని సూచించారు. ఎస్సైపై ఏసీబీ రైడ్స్ చేయిస్తానని బెదిరించారు. జిల్లాలో గల మిగతా పోలీసులపై కూడా దాడులు చేయిస్తానని హెచ్చరించారు. హనుమంతుతో.. తిరుపతయ్య మాట్లాడారో లేదో.. ఇప్పుడు సీఐ సస్పెన్షన్‌లో ఉన్నారు. అతనని ఎవరు సస్పెండ్ చేయించారో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి హనుమంతుకు ఈ కేసుతో సంబంధం లేదు. ఎస్సై చూస్తున్న కేసును మాత్రం పరిశీలించాల్సి ఉంది. కానీ తిరుపతయ్య అందరినీ కలిపి బెదిరించాడు. నేను చూస్తా.. మాట్లాడతా అని చెప్పినా వినిపించుకోలేదు. సస్పెండ్ చేసేవరకు ఊరుకోలేదు అని తెలుస్తోంది. ఇలా కొందరు చేసే పనులతో మిగతావారు ఇబ్బంది పడతారు. మంచి చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది.












Click it and Unblock the Notifications