బాలాపూర్ హుండీ ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు.. 11 రోజుల్లో ఇన్ని లక్షలా

దేశవ్యాప్తంగా 11 రోజుల పాటు ఘనంగా జరిగిన గణేష్ ఉత్సవాలు ముగిశాయి. దిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్లు దేశం మొత్తం గణపతి బప్పా మోరియా.. అంటూ హోరెత్తింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సారి గణేష్ నవరాత్రులు ఘనంగా, ప్రశాంతంగా జరిగాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనుకున్న సమయానికి నిమజ్జనం పూర్తి చేశారు. అలగా బాలాపూర్ గణేష్ ఉత్సవాలు కూడా ఈసారి ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అంతటి ప్రాచుర్యం బాలాపూర్ గణనాథుడికి ఉంది. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాట రికార్డు స్థాయిలో జరిగింది.

ఈ ఏడాది వేలంలో బాలాపూర్ గణపతి లడ్డూ ప్రసాదం రూ. 35 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. బాలాపూర్ గణేష్ లడ్డూను కర్మన్‌ ఘాట్‌ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గత ఏడాది కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేశుని లడ్డూను రూ.30.01 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సారి రూ. 5 లక్షలు పెరగడం విశేషం. అయితే బాలాపూర్ గణపతికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఈసారి గణనీయంగా పెరిగింది.

హూండీ కానుకల ద్వారా బాలాపూర్ వినాయకుడికి రూ.23 లక్షల ఆదాయం వచ్చినట్లు కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. గత ఏడాది కంటే రూ.5 లక్షలు పెరిగిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను ఉత్సవ కమిటీ సభ్యులు లెక్కించారు. రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది. గతేడాది హుండీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రూ.18 లక్షలు గా ఉంది. ఈసారి దాదాపు రూ.5 లక్షల మేర అధికంగా వచ్చినట్లు కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Balapur Ganpati Hundi Collects Rs 23 Lakh This Year

ఇక 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు అయింది. 1994 నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఇక ఈసారి బాలాపూర్ గణేష్ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణగిరి సెట్టింగ్, గణేశుడి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే భక్తులు భారీగా తరలివచ్చారు. అందువల్లనే హుండీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+