రాజశ్యామల యాగం సాక్షిగా కవితకు లిక్కర్ కుంభకోణంతో సంబంధం లేదని ప్రమాణం చెయ్ కేసీఆర్!!

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామం నుండి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నేడు జగిత్యాల టౌన్, ధరూర్, రాజారం, తారక్ రాం నగర్, నూక పల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట మీదుగా కొండగట్టు వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర సాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

కెసిఆర్ ఏపీతో లోపాయికారి ఒప్పందం

కెసిఆర్ ఏపీతో లోపాయికారి ఒప్పందం

కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న బండి సంజయ్ సమైక్యాంధ్ర చిచ్చు రగిల్చి, సెంటిమెంట్ తో మళ్లీ లబ్దిపొందాలని కెసిఆర్ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదని, 1,400 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ ఏపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అడ్డగోలుగా సంపాదించిన కుటుంబాన్ని కాపాడుకోడానికే.. ప్రజల దృష్టి మళ్లించి, నీచ రాజకీయాలను చేస్తున్నాడని ఆరోపించారు.

యాగాలు చేసి తెలంగాణా ప్రజలకు ఏం చేశావ్

యాగాలు చేసి తెలంగాణా ప్రజలకు ఏం చేశావ్


కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోరని పేర్కొన్న బండి సంజయ్ కెసిఆర్ చెల్లని రూపాయి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడే చెల్లని రూపాయి బి ఆర్ ఎస్ పేరుతో అక్కడ చెల్లుతారా అంటూ కేసీఆర్ జాతీయ రాజకీయాలను టార్గెట్ చేసిన బండి సంజయ్, కెసిఆర్ కుటుంబం అంతా అవినీతి మయం అన్నారు. కేసీఆర్ పేదోళ్లను అరిగోస పెడుతున్నాడని విమర్శించారు. ఏ యాగం చేసినా... నీకు ఫలించదన్నారు. గతంలో తెలంగాణలో యాగం చేసిన తర్వాత, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేశావ్? చెప్పాలని నిలదీశారు.

ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే నీ పాపాలు పోతాయా?

ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే నీ పాపాలు పోతాయా?


ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే... నీ పాపాలు పోతాయా? అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ రాజశ్యామల యాగం సాక్షిగా ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారో, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇతర చూపించాలన్నారు. కాళేశ్వరంప్రాజెక్టు లో ఎంత కమిషన్ దొబ్బావో.. ముందు ప్రజలకు లెక్క చెప్పాలన్నారు. రాజ శ్యామల యాగం సాక్షిగా నీ కూతురికి ఢిల్లీ లిక్కర్ స్కాం తో సంబంధం లేదని ప్రమాణం చెయ్ కెసిఆర్ అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. లిక్కర్ కేసులో నీ కూతురు కవిత ప్రమేయంపై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. కవిత ఇంటి దగ్గర సింహాలు, పులుల ఫోటోలు ఏంటి అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ కెసిఆర్ కు బిజెపి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కాలు విరుగుతుంది.. కరోనా వస్తుంది

మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కాలు విరుగుతుంది.. కరోనా వస్తుంది


దేశంలో అవినీతి విషయంలో ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సీబీఐ వెళ్లి దర్యాప్తు చేస్తుంది అని పేర్కొన్న బండి సంజయ్ సీబీఐ రావొద్దు అని చెప్పడానికి నువ్వెవరు? అంటూ నిలదీశారు. మోడీ వచ్చేముందు ఈడీ రాదు అని పేర్కొన్న బండి సంజయ్ మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కాలు విరుగుతుందని, ఇంకొకరికి కరోనా వస్తుందని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదిస్తే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఎలా ఉంటాయో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. సీబీఐకి బిజెపి కి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను నిలదీశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకంలేని కేసీఆర్ కు జాతీయపార్టీ దేనికి?

కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకంలేని కేసీఆర్ కు జాతీయపార్టీ దేనికి?

ధరణి పేరుతో కెసిఆర్ భూములను దండుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల్లో బిజెపిని ఓడించటం కోసం కెసిఆర్ వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్తున్నటువంటి కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారు అంటూ నిలదీశారు.దేశానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి విచారణ జరిపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఇక ఇదే సమయంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 15న మధ్యాహ్నం 1గంటకు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో జరగనుందని పేర్కొన్న బండి సంజయ్ ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరవుతారన్నారు. జనసమీకరణ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కరీంనగర్ నుంచి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ చేసి కేసీఆర్ కు చాలెంజ్ విసురుతాం అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+