ఆత్మసాక్షిగా కూడా అబద్ధమే.. మీకు ఆధ్యాత్మికత ఎక్కడిది? బండి సంజయ్!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రార్ధనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను అందరికీ పంచుతున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తున్నారని చెప్తున్నారు. అనేక ఆలయాలలో నేడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. యాదాద్రి నిర్మాణం చేసి, కొండగట్టు అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ గురించి చెప్పే యత్నం చేస్తున్నారు.

Bandi Sanjay

నేడు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఉద్దేశించి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. నోరు తెరిస్తే అబద్దాలు చెప్పే మీకు ఆధ్యాత్మికత లేదని విరుచుకుపడ్డారు. హిందూ గాళ్ళు, బొందు గాళ్ళు అంటూ దుర్భాషలు ఆడారని గుర్తు చేశారు. భయంకర హిందువుని నేనంటూ ప్రగల్భాలు చెప్పుకోవటం తప్ప హిందువులకు చేసిందేమీ లేదని అన్నారు.

యాదాద్రేమో మీకు పెట్టుబడి అంటూ మండిపడ్డారు. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు అంటూ ఎద్దేవా చేశారు. భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెడతావు. ఈ ధర్మాన్ని తిట్టేవాన్ని తలపైకెత్తుకుంటావు అంటూ నిప్పులు చెరిగారు.

Bandi Sanjay

అంతేకాదు ఆత్మ సాక్షిగా కూడా అబద్ధమే చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది? అంటూ పరోక్షంగా తెలంగాణా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు బండి సంజయ్. ఇప్పటికే తెలంగాణా అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా ప్రతీరోజూ ఒక శాఖ సాధించిన ప్రగతిని తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించి నిర్వహించారు. అయితే ప్రతీ శాఖ ప్రగతి చెప్పేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తే, అందులో వైఫల్యాలు చెప్పటానికి బండి సంజయ్ ప్రయత్నించారు, నిత్యం తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+