మున్సిపల్ ఎన్నికలు అవగానే ఇంటిపన్నుల పెంపు: చెప్పిన కేంద్రమంత్రి!

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రాజకీయాలలో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కాగా, జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కిసాన్ నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార కాంగ్రెస్ తో పాటు ప్రత్యర్థి పార్టీల పైన టార్గెట్ చేశారు.

బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజ్ లో వేసినట్టే

మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటిపన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Bandi Sanjay shocking comments Congress plan to increase property tax after municipal elections

బీఆర్ఎస్ ఖర్చు పెట్టేది ప్రజల డబ్బే

పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారని, ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది, ఇదంతా ప్రజల డబ్బే నని ఆయన పేర్కొన్నారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే... కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది

నేను పైసలు తీసుకొస్తే... బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది అంటూ కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చారు. కరీంనగర్ కోసం తాను తెచ్చిన నిధుల వివరాలను ప్రజలకు లెక్క చెప్పారు.

మూట, ముల్లె సర్దుకో గంగుల

కరీంనగర్ కోసం తాను తెచ్చిన వివరాలన్నింటినీ ఐదులక్షల కాపీలను ప్రింట్ చేసి ఇంటింటికి పంపి ప్రతి ఒక్కరు వాటిని చూసి చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి, మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపోవాలంటూ బండి సంజయ్ హెచ్చరించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+