మీరు అద్భుతం.. యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా: కేసీఆర్‌పై బండ్ల గణేష్ ప్రేమ!!

తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వ్యక్తి ఉండరు. సినీ నిర్మాతగా, నటుడుగా టాలీవుడ్ లో పనిచేసిన బండ్ల గణేష్, రాజకీయాలలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఘోర పరాభవం పాలై ఈ రాజకీయాలు నాకొద్దు మహాప్రభో అంటూ రాజకీయాల నుండి పక్కకు వెళ్లారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ పైన, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ఇప్పుడు కెసిఆర్ పాట పాడుతున్నారు. కెసిఆర్ లాంటి నాయకుడు లేడు అంటూ కితాబిస్తున్నారు.

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసల జల్లు

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసల జల్లు


తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందని ఆయన తనదైన శైలిలో కితాబిచ్చారు. ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో .. నేను చెప్పట్లేదు అని పేర్కొన్న ఆయన, తన మనసులోని మాటను చెబుతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుందని, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా సరైన మార్గంలో నడిపించే సత్తా, సమర్థత కేసిఆర్ కు ఉందని తాను నమ్ముతున్నట్టు బండ్ల గణేష్ వెల్లడించారు.

లవ్ యు కేసీఆర్ గారు: ప్రేమ కురిపించిన బండ్ల గణేష్

భారతదేశానికి తన అమూల్యమైన సేవలను అందించాలని కోరుకుంటున్నట్టు బండ్ల గణేష్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మంచి చేస్తే మంచి అని చెబుతాను.. లేకపోతే మౌనంగా ఉంటాను.. అది నా నైజం సార్ అంటూ పేర్కొన్న బండ్ల గణేష్ మీరు అద్భుతం.. యు ఆర్ ఎ వండర్ఫుల్ .. యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు అంటూ తనదైన శైలిలో కేసీఆర్ ను నెత్తికెత్తుకున్నారు.

యాదాద్రి ఆలయం చూసిన తర్వాత కెసిఆర్ సామర్థ్యం మీద నమ్మకం కలిగింది

యాదాద్రి ఆలయం చూసిన తర్వాత కెసిఆర్ సామర్థ్యం మీద నమ్మకం కలిగింది

అంతేకాదు నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని, మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్న బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. యాదాద్రి ఆలయం చూసిన తర్వాత కెసిఆర్ సామర్థ్యం మీద నమ్మకం కలిగిందని పేర్కొన్న ఆయన ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది.. అది ఎంతగానో ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు.

కేసీఆర్ ఆలోచనా విధానం మహా అద్భుతం

కేసీఆర్ ఆలోచనా విధానం మహా అద్భుతం

యాదాద్రి ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు అంటూ పేర్కొన్న ఆయన, కెసిఆర్ ఏదైనా సాధించగలరంటూ చెప్పుకొచ్చారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి అందుకు నిదర్శనం అన్నారు. కెసిఆర్ గారి ఆలోచన, ఆచరణ, ఇవే కాకుండా వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులు కానీ, ఆయన ఆలోచన విధానం గాని మహా అద్భుతంగా తృప్తి చెందానని బండ్ల గణేష్ తెలిపారు. ఆయన భవిష్యత్ రాజకీయాల్లో దూసుకుపోవాలని ఆశిస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+