Bathukamma: ఆక్లాండ్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. ప్రకృతి ప్రేమించే బతుకమ్మ పండుగ ఆడబిడ్డలకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు నిర్వహించుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మొదటి ఎనిమిది రోజులు ఆడ పిల్లలు బతుకమ్మను పేర్చి.. పాటలు పాడుకుంటూ ఆడుతుంటారు. సద్దుల బతుకమ్మ రోజు చిన్న, పెద్ద అందరు కలిసి పండుగ జరుపుకుంటారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి, రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. బతుకమ్మపై పసుపుతో గౌరమ్మను చేసి ఆకులో ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత డప్పు చప్పుళ్లతో బతుకమ్మలను చౌరస్తా వద్ద పెట్టి బతుకమ్మ ఆడతారు. చివరిగా చెరువు వద్దకు వెళ్తారు. గౌరమ్మను తీసుకుని కొంగులో కట్టుకుంటారు. తర్వాత బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ పసుపును తంబాలంలో కలిపి ఆడ పడుచులు ఒకరి ఒకరు బొట్టులాగా పెట్టుకుంటున్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణలో ఉన్న వారే కాదు. విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు ఘనంగా జరుపుకుంటారు.

Bathukamma festival was celebrated grandly in Auckland New Zealand

దుబాయి, సౌదీ, అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా ఇలా తెలంగాణ వారు ఎక్కడుంటే.. అక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. తాజాగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అతి పెద్ద బతుకమ్మ పేర్చిన కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి వచ్చింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్నారు.

తాము ఎక్కడున్న బతుకమ్మ పండు నిర్వహించుకుంటామని చెబుతున్నారు. తము చిన్న వయసులో ఉన్నప్పుడు పూవ్వుల కోసం అడవికి వెళ్లే వారమని వారు తెలిపారు. బతుకమ్మ వచ్చిందంటే.. చాలా ఆడ పడుచులందరు పుట్టింటికి వస్తారని వారు గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+