బెట్టింగ్ యాప్స్ కేసు... కోర్టు మెట్లెక్కిన యాంకర్ విష్ణుప్రియ, నేడు మళ్ళీ పోలీసుల విచారణ!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మొదట బెట్టింగ్ యాప్స్ కేసులో 11 మంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, బుల్లితెర నటుల పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిని విచారణ
ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రణీత ,నేహా శర్మ, ప్రకాష్ రాజ్ ఇలా టాలీవుడ్ సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిందితులుగా ఉన్న వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ జరుపుతున్నారు.

Betting apps case Anchor Vishnupriya moves high court Police investigation again today

హైకోర్టులో క్వాష్ పిటీషన్
ఈ క్రమంలోనే నేడు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావలసిన విష్ణు ప్రియ తనపైన నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే దీనిపైన హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఆమె నేడు పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.

తనపై రెండు కేసులు కొట్టివేయాలని విజ్ఞప్తి
కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన యాంకర్ విష్ణు ప్రియ తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కొట్టివేయడంతో పాటుగా అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఒకే కేసులో తనపై రెండు కేసులు ఎలా నమోదు చేస్తారని ఉన్నత న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించారు. ఇక కోర్టు నిర్ణయం తర్వాతనే విష్ణు ప్రియ నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్నారు.

Take a Poll

సెలబ్రిటీగా మారిన విష్ణు ప్రియ
తెలుగు బుల్లితెర తో పాటు వెండితెరలో కూడా విష్ణు ప్రియ తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ తో పాటు టీవీ లోనూ తన షోస్ తో విష్ణు ప్రియ దూసుకుపోతున్నారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. దీంతో ఆమెకు సెలబ్రిటీ గా గుర్తింపు వచ్చింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భారీగానే సంపాదించిన విష్ణు ప్రియ
ఈ క్రమంలోనే విష్ణు ప్రియ ను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు సంప్రదించి ఆమె ద్వారా ప్రమోషన్స్ చేయించారు ఈ క్రమంలో విష్ణు ప్రియకు భారీ మొత్తంలో నగదు చెల్లించినట్లు సమాచారం. అయితే విష్ణు ప్రియ కు ఇచ్చినటువంటి నగదు లావాదేవీలు ఆమె బెట్టింగ్ యాప్స్ కోసం చేస్తున్న ప్రమోషన్స్ తదితర అన్ని వివరాలను సేకరించిన పోలీసులు ఆమెపైన చర్యలకు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో విష్ణు ప్రియ హైకోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+