బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్స్ కేసులో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు, యాక్టర్లు, యూట్యూబర్ లను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన కేసులో వీరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా యాంకర్ శ్యామలను కూడా విచారిస్తున్నారు. నేడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

పోలీసుల విచారణకు యాంకర్ శ్యామల
తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన శ్యామల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 8:44 ప్రాంతంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సుమారు మూడున్నర గంటలుగా యాంకర్ శ్యామలను పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమ విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు సూచించిన పోలీసులు అన్ని కోణాలలోనూ ఆమె నుండి వివరాలను రాబడుతున్నారు.

Betting apps promotions case Anchor Shyamala to Panjagutta police station

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామలతో పాటు ఈరోజు పోలీసుల విచారణకు భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే టీవీ యాంకర్ విష్ణు ప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటివరకు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. వీరి ఇరువురి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.

వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై ట్రోల్
ఇక యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఉన్న కారణంగా నటి శ్యామల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ ప్రతినిధి అంటూ మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్లు పంజాగుట్ట పిఎస్ కు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

మరోమారు వారికి నోటీసులు ఇవ్వటానికి అధికారులు అలెర్ట్
న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన శ్యామల పోలీసులకు విచారణలో ఏం చెబుతున్నారు అన్నది ఆసక్తికరమైన విషయం. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురిని విచారించిన పోలీసులు ఈ కేసులో ఉన్న మిగతా వారిని కూడా విచారించడానికి పరారీలో ఉన్న వారికి మరోమారు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు .కాగా భయ్యా సన్నీ యాదవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన నేడు విచారణ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+