కాయ్ రాజా కాయ్: తెలంగాణా ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగులు!!
తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రేపు పోలింగ్ ట్రెండు ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన చర్చ జరుగుతుంది.
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓటమి పాలవుతుంది? అన్నది ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ జరుగుతున్న చర్చ. ఇక ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను గురించి ఆంధ్రప్రదేశ్లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయని చర్చ జరుగుతుంది.

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ వారికి ఆసక్తి ఎందుకు అంటే.. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణా ఎన్నికలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్ లు పెట్టే దాకా తీసుకెళ్ళింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బోణి కొడుతుందా? తెలంగాణలో బిజెపికి ఎన్ని స్థానాలు వస్తాయి? వంటి అనేక అంశాల పైన బెట్టింగ్లు మొదలుపెట్టారు.
ఇక అంతే కాదు అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజకవర్గాల పైన కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి.గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గెలుస్తాడా? ఓడిపోతాడా? కామారెడ్డి లో కేసీఆర్ గెలుస్తారా.. ఓడిపోతారా? కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా లేదా? నల్గొండలో కోమటిరెడ్డి విజయం సాధిస్తారా లేదా? అని కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి.
కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉంది? వంటి అనేక ప్రశ్నలపై బెట్టింగులు వేస్తున్నారని సమాచారం. ఇక ఒకటికి మూడు రెట్లు ఇస్తాం, ఒకటికి రెట్టింపు ఇస్తాం అంటూ కీలక అభ్యర్థుల గెలుపోటములపై పందెం కాస్తున్నారని సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications