Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భద్రాద్రి రామయ్య బ్రహోత్సవాలు.. వైభవంగా సీతారాముల కళ్యాణం.. ముహూర్తం ఎప్పుడంటే!!

బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి సిద్ధం అవుతుంది. ప్రతీ సంవత్సరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామిబ్రహ్మోత్సవాలు చైత్ర మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా రామయ్య బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే బ్రహోత్సవాలకు సంబంధించిన తేదీలను, విశేషాలను వైదిక కమిటీ వెల్లడించింది.

భద్రాచల దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించిన ముహూర్తమే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు కొలమానంగా ఉంటుందని మనకు తెలిసిన విషయమే. భద్రాచలం ఆలయ వైదిక కమిటీ వెల్లడించిన వివరాల మేరకు ఏప్రిల్ 9వ తేదీన భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, ఏప్రిల్ 23 న పూర్తవుతాయి. ఏప్రిల్ 17 వ తేదీన శ్రీసీతారామ చంద్ర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Bhadradri Sri seetharama chandra swamy Brahmotsavam in april.. this is the schedule

ఇక ఏప్రిల్ 18 వ తేదీన శ్రీ సీతారామ చంద్ర స్వామికి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైదిక కమిటీ ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23వరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విషయానికి వస్తే.. ఏప్రిల్ 13వ తేదీ మండల, రచన, కుండ, కలశం, యాగశాల, అలంకారాలు, సార్వభౌమ వాహన సేవలు స్వామివారికి నిర్వహిస్తారు. ఏప్రిల్ 14వ తేదీ గరుడ ధ్వజ పత లేఖనం, ఆవిష్కరణ, గరుడాధివాసం నిర్వహిస్తారు.

ఏప్రిల్ 15వ తేదీన అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీ తాడనం, దేవత ఆహ్వానం, బలి సమర్పణ, హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 16వ తేదీన యాగశాల పూజ, చతుర్ స్థానార్చన, ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు శ్రీరామ పునర్వసు దీక్షను ప్రారంభిస్తారు.

ఏప్రిల్ 18వ తేదీన మహా పట్టాభిషేకం, 19వ తేదీన మహదాశీర్వచనం, ఏప్రిల్ 20న తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 21న ఊంజల్ సేవ, ఏప్రిల్ 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, శ్రీ పుష్పయాగం, బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఉంటాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 23 వరకు నిత్య కళ్యాణం, అలాగే దర్బార్ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మే 1 వరకు పవళింపు సేవలు ఉండవని ఆలయ నిర్వహణ కమిటీ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+