హైదరాబాద్ కు 50 కి. మీ. దూరంలోనే.. ఈ కోట అందాలకు ఫిదా అవ్వాల్సిందే..

వీకెండ్, సెలవులు వచ్చాయంటే నగరవాసులు ట్రిప్స్ కు ప్లాన్ చేస్తుంటారు. సమయం ఎక్కువగా లేకపోవడం కారణంగా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చే విధంగా టూర్ ప్లానింగ్ చేసుకుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గర్లోనే 50 కి. మీ. దూరంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ప్రకృతి రమణీయత మధ్య అలరారుతున్న ఓ ప్రదేశం గురించి మీకు తెలుసా..? నిత్యం వందలాది మంది పర్యటకులతో ఈ ప్రదేశం ఉంటుంది. ఇక వేసవి సెలవుల్లో అయితే టూరిస్టుల తాకిడి అధికంగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి మళ్లీ.. సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చే విధంగా ఈ టూర్ ను ప్లానింగ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఈ భువనగిరి కోట ఎంతో ప్రసిద్ధి గాంచింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ కోట. ఈ ఏకశిలా కోటను చాణిక్య వంశానికి చెందిన ఆరవ రాజు త్రిభువన మల్ల విక్రమాదిత్య నిర్మించారు. ఈ కొండ ఎత్తు 610 మీటర్లుగా ఉంటుంది. కొండపైన కోటను నిర్మించారు. కొండను ఎక్కాలంటే సాహసాలు చేయాలంటే. మార్గ మధ్యలో మంచి థ్రిల్లింగ్ గా యాత్ర సాగుతుంది. ఈ ఏకశిలా కోటపై ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తుంటే వావ్ అని ఫీలింగ్ ఉంటుంది. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్లు, వాటి తర్వాత పచ్చని పంట పొలాలు.. అక్కడక్కడా పక్షుల రాగాలు, నెమళ్ల పరుగులను వీక్షిస్తూ కొండపైకి చేరుకోవచ్చు.

ఇక కొండపైన కోటను నిర్మించారు ఆనాటి రాజులు. కొండపైనుంచి కిందకు చూస్తే భువనగిరి పట్టణం మొత్తం కనిపిస్తుంది. ఇళ్లు ఇతర ప్రదేశాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. హైదరాబాద్ కు కేవలం 47 కి. మీ. దూరంలోనే ఈ ప్రాంతం ఉన్న నేపథ్యంలో వీకెండ్స్ లో ఈ కోటను సందర్శించేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో ఉంటారు. వందల సంవత్సరాల నుంచి ఈ కోట అనేక పోరాటాలకు, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తోంది. ఈ కొండపైన నిత్యం అనేకమంది చిన్నారులు ట్రెక్కింగ్ నేర్చుకుంటారు.

Bhuvanagiri Fort Hyderabad s Hidden Gem Just 50 km Away

ఈ కొండను చేరుకునే మార్గమధ్యంలో కాకతీయ రాజుల శిల్పశైలి, కళాకృతులు, ధాన్యాగారాలు, సైనికులు సేద తీరే ప్రాంతాలు, రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రాసాదాలు, పుష్పాలంకరణలు, కాకతీయ శైలిలో అనేక శిల్ప కళాకృతులు చెక్కారు. వీటన్నింటినీ చూస్తూ కొండపైకి చేరుకోవచ్చు. అలాగే కోటకు సమీపంలో శివాలయం, నంది విగ్రహం, కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+