కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టు చేయబడి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇక కవిత అరెస్టుపై నిన్నటి వరకు నోరు మెదపని కేసీఆర్ ఒక్కసారిగా కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యలు చేశారు.

కవిత అరెస్ట్ పై లేటుగా స్పందించిన కేసీఆర్
కవితపై ఎటువంటి కేసు లేకుండా కక్షపూరితంగా అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన వ్యవహారంలో బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయడానికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని అందుకే తమపై కక్ష పెంచుకొని కవితను అరెస్టు చేశారని కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Big reason behind KCR response on Kavitha arrest after one month

కవిత అరెస్ట్ పై కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
కెసిఆర్ తాజా వ్యాఖ్యలతో ఇదే విషయాన్ని కేసిఆర్ కవితను అరెస్టు చేసిన సమయంలోనే ఎందుకు చెప్పలేదు అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబు ఏమైనా ఉందా అని కూడా చర్చిస్తున్నారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం అంగీకారం అన్న చర్చ
ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ మాట్లాడకపోవడం కవిత నేరం చేసినట్టు ఆయన కూడా అంగీకరించటమేనని ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికలకు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వేళ కవిత అరెస్టు గురించి కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని ప్రజలు తప్పుగా చూస్తారు.

లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్ స్పందన ఇందుకే
కవిత తప్పు చేసినట్టుగానే ప్రజలు భావించే అవకాశం ఉంటుందని దీనిపై అధినేత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వేళ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ కవిత అరెస్టుపై లేటుగా ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికలలో కేంద్రంలోని అధికార బీజేపీ బీఆర్ఎస్ పై కక్షపూరితంగా వ్యవహరించి కవితను అరెస్ట్ చేసిందని చెప్పి తాము బిజెపి పై పోరాటం చేస్తున్నామని అందులో భాగంగానే ఈ కష్టాలు అని చెప్పే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+