తలక్రిందులైన కేసీఆర్ రాజకీయం.. ఆపలేని వలసలపర్వం!!
కుడిఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అన్నాడు ఓ మహాకవి.. అయితే ఆ మాటలు రాజకీయాల్లో అస్సలు పనికిరావు. రాజకీయాల్లో కుడిఎడమైతే, ఓటమిపాలైతే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు సరిగ్గా అటువంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్.
గత పది ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యం కింద పాలించిన ఆయన.. తన మాటే శాసనం అంటూ పార్టీని నడిపించిన కేసీఆర్ ఇప్పుడు పార్టీలో నుండి వలసలు వెళుతున్న వారిని ఆపలేకపోతున్నారు. స్వయంగా బుజ్జగించినా, బతిమాలినా నేతలు వినకపోవడం కాంగ్రెస్, బిజెపిల వైపు చూడడం ప్రస్తుతం కెసిఆర్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది.

దేశ్ కి నేతగా దేశ రాజకీయాలు చేస్తానని చెప్పిన కేసీఆర్ గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలనే చేయలేకపోతున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్న ఆయన పోటీ చేయడానికి పార్టీ నేతలు విముఖత చూపుతున్న క్రమంలో ఖంగు తింటున్నారు .తన వాళ్ళు ఎవరో, కాని వాళ్ళు ఎవరో అర్థం చేసుకోలేక కెసిఆర్ ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే పెద్దపల్లి లోక్సభ టికెట్ ఆశిస్తూ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల టిక్కెట్ కోసం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ బాట పట్టారు.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఇక నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ ఎంపీలు గోడెం నగేష్, సీతారాం నాయక్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక ప్రస్తుతం ఆరూరి రమేష్ కూడా కేసీఆర్ బుజ్జగించినా వినకుండా బిజెపి బాట పట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అని నియోజకవర్గాలలోను బీఆర్ఎస్ నేతలు వలసల బాట పట్టడం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఊహించని పరిణామం.
దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వలసల నేపథ్యంలో కారు ఖాళీ అయిపోతుంది. మరి ఈ పరిస్థితులను అధిగమించి పార్టీని ముందుకు నడిపించడానికి గులాబీ బాస్ కింకర్తవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయించాలి.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications