బీజేపీకి బిగ్ ట్రబుల్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో ఆ బీజేపీ మహిళానేతలు?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బిజెపి అని గతంలో చెప్పుకున్న బిజెపి ప్రస్తుతం ఊహించని విధంగా వరుస షాక్ లతో కుదేలు అవుతుంది. ఎన్నికల సమయంలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో బిజెపిలో చేరిన పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తితో, మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్న తీరు బిజెపిని ఆందోళనకు గురిచేస్తుంది. అసలే ప్రజా క్షేత్రంలో బీజేపీకి తగ్గిన పట్టు, ఆపై నేతల తీరు వెరసి బీజేపీ ఊహించని చావు దెబ్బ తింటుంది.

Big trouble for BJP: Those BJP women leaders in the path of Komatireddy Rajagopal Reddy?

తాజాగా బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ షాకిచ్చారు. తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని, మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ నే అని ఆయన తేల్చి చెప్పారు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలో బిజెపిలో అసంతృప్తితో ఉన్న కొందరు మహిళా నేతలు కూడా వెళ్లనున్నారు అన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే గద్వాలలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు డీకే అరుణ విముఖతతో ఉన్నట్లు ఆమె అనుచరులు తెలుపుతున్నారు. గద్వాలలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉండడంతో, బిజెపి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం.

Big trouble for BJP: Those BJP women leaders in the path of Komatireddy Rajagopal Reddy?

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన మరో నాయకురాలు విజయశాంతి సైతం పార్టీ తీరుపై తీవ్ర విముఖత తో ఉన్నారు. పార్టీలో తనకు గుర్తింపునివ్వడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోకాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న క్రమంలో బిజెపికి నేతలు వరుస షాక్ లు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+