పిచ్చెక్కిపోతున్నావ్: జనం ఏమనుకుంటున్నారో థింక్ చేశావా: సిరి-షన్నును ఏకి పారేసిన జెస్సీ

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు వచ్చేసింది. ఇంకో వారమే మిగిలి ఉన్నాయి. అటు బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఈ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ వారం మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 13 మంది ఎలిమినేట్ అయ్యారు. 14వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆర్జే కాజల్. ఇప్పటి వరకు స్ట్రాంగ్ కంటెండర్‌గా ఉన్న ఆర్జే కాజల్... ఫైనల్స్‌లో చోటు సంపాదిస్తుందని అంతా భావించారు. కానీ ఈ వారం ఎలిమినేటై అందరి అంచనాలను తలకిందులు చేసింది.

కాజల్‌కు నో ఛాన్స్..

కాజల్‌కు నో ఛాన్స్..


ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆర్జే కాజల్ అని తెలుస్తోంది. ఈ దఫా ఆమె పెర్‌ఫార్మెన్స్ ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతోన్నాయి. టాస్కుల్లో ఆమె తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయారని అంటున్నారు. ఇన్నిరోజులు కొనసాగడమే గొప్ప అనే నెటిజన్లు, వీక్షకులు కూడా లేకపోలేదు. పూర్ పెర్‌ఫార్మెన్స్ వల్ల బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ రేస్ నుంచి కాజల్ తప్పుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారనే అంచనాలు ఉన్నాయి.

టాప్ 5లో సన్నీ ఎంట్రీ..

టాప్ 5లో సన్నీ ఎంట్రీ..

టైటిల్ రేసులో నిలిచే తొలి అయిదుమంది ఎవరనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ రాత్రి నాటి ఎపిసోడ్‌తో అది అధికారికంగా తేలిపోతుంది. శ్రీరామచంద్ర ఇదివరకే ఫైనలిస్ట్ అయ్యాడు.. ఫైనల్ లిస్ట్‌లోకి వచ్చేశాడు. రెండో ఫైనలిస్ట్‌గా వీజే సన్నీ నామినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో రెండో ఫైనలిస్ట్ అతనే. మిగిలిన ముగ్గురు ఎవరు.. వారి నంబర్సే ఏమిటనేది ఈ రాత్రి నాటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. కాజల్ ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయమైందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- మానస్ నాగులపల్లి, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్ టాప్-5లో ఎంట్రీ కావచ్చు.

సిరి-షన్ను క్లోజ్‌నెస్‌పై..

సిరి-షన్ను క్లోజ్‌నెస్‌పై..

బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని వారాలుగా షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతు చాలా క్లోజ్‌గా ఉంటోన్నారనేది బహిరంగ రహస్యం. చాలా ఎపిసోడ్స్‌లో ఇది స్పష్టమైంది కూడా. షన్ను వెంటే సిరి అన్నట్టుగా కనిపించారు వారిద్దరు. చాలా టాస్క్‌లల్లో వారిద్దరూ ఒకరినొకరు సపోర్టు చేసుకున్నారు. శనివారం రాత్రి నాటి ఎపిసోడ్‌లోనూ ఇదే కనిపించింది. ఉన్న ఆరు మందిలో ఎవరు.. ఏ స్థానంలో ఉండాలనే విషయంపై నిర్వహించిన హోస్ట్ అక్కినేని నాగార్జున నిర్వహించిన గేమ్‌లో సిరి హన్మంతు.. షణ్ముఖ్ జశ్వంత్‌ను సపోర్ట్ చేశారు. నా సపోర్ట్ ఎప్పుడూ వాడికే అంటూ షన్నును ఉద్దేశించి చెప్పారు.

క్లోజ్‌నెస్ దెబ్బ కొడుతుందా?

క్లోజ్‌నెస్ దెబ్బ కొడుతుందా?

బిగ్‌బాస్ హౌస్‌కు రాకముందు వారిద్దరి మధ్య ఎలాంటి పరిచయాలు ఉండేవో.. అసలు ఉన్నాయో లేదో తెలియట్లేదు గానీ.. ఈ ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చిన తరువాత క్లోజ్ అయ్యారు. హౌస్ నుంచి జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ అనారోగ్య కారణాలతో బయటికి వెళ్లిన తరువాత సిరి-షన్ను మిగిలారు. తామిద్దరం స్నేహితులం అని చెప్పుకొంటూనే దానికి మించి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటూ నెటిజన్ల నుంచి కామెంట్స్ సైతం వ్యక్తం అయ్యాయి. నటి మాధవీలత వారిద్దరిపై ఫైర్ అయింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీళ్లిద్దరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వీకెండ్ ఎపిసోడ్ స్పెషాలిటీ అదే..

ఈ వీకెండ్ ఎపిసోడ్ స్పెషాలిటీ అదే..

ఇవ్వాళ రాత్రి బిగ్‌బాస్ మాజీ హౌస్‌మేట్స్ ప్రత్యక్షం కానున్నారు. హౌస్‌లో కొనసాగుతోన్న కంటెస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రొమోను నిర్వాహకులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.. ఈ ప్రొమోలో ప్రత్యక్షం అయ్యారు. వారిద్దరూ సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నాగులపల్లితో మాట్లాడటం.. వారిని నిలదీయడం ఈ ప్రొమోలో కనిపించిది.

 జెస్సీ సైతం..

జెస్సీ సైతం..

సిరి హన్మంతు-షణ్ముఖ్ జశ్వంత్ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో నడుస్తోన్న ట్రాక్ గురించి జెస్సీ సూటిగా ప్రస్తావించాడు. ఈ విషయంలో జెస్సీ.. సిరి-షన్నులను ఏకి పారేశాడు. సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నవాడిగా పేరున్న, ఏదైనా ముఖం మీదే చెబుతాడనే పేరున్న జెస్సీ.. తన వైఖరిని మరోసారి చాటి చెప్పాడు. వారిద్దరి రిలేషన్‌షిప్ గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారో సిరి-షన్ను ముందే కుండబద్దలు కొట్టాడు. వారిద్దరి రిలేషన్‌షిప్ మీద తాను ఏమి చెప్పదలచుకున్నాడో సూటిగా చెప్పేశాడు. ఎలాంటి మొహమాటాలకు పోలేదు.

Recommended Video

    Bigg Boss Telugu 5 : Shannu Slams Vj Sunny Fans || Oneindia Telugu

    జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?

    షన్ను. చాలా సీరియస్‌గా అడుగుతున్నాను. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. జనాలు ఏమనుకుంటున్నారో.. నువ్వెప్పుడైనా థింక్ చేశావా?..అని నిలదీశాడు. ఊహించని విధంగా జెస్సీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు షణ్ముఖ్ బిత్తర చూపులు చూశాడు. అలాగే సిరిపై కూడా ఘాటుగా ప్రశ్నలను సంధించాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి ఎమోషనల్‌కు కనెక్టయిపోతున్నామా? అది కనెక్టయిపోతున్నామా? ఇది కనెక్టయిపోతున్నామా? అని చెప్పి పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు.. అని సూటిగా సిరిని ప్రశ్నించాడు జెస్సీ. దీనిపై వారి నుంచి ఏం సమాధానం వస్తుందనేది ఈ రాత్రి ఎపిసోడ్‌లో స్పష్టమౌతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+