Bigg boss season 9: శనివారం నాగార్జున షోలో సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ముంబై వెళ్ళిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి వివాహానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటనలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్.. బీఆర్ఎస్ సెటైర్లు
ఇక ఆ పోస్ట్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిశాంక్ రేవంత్ రెడ్డి పైన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారని ఆయనను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేత డాక్టర్ క్రిశాంక్ సల్మాన్ ఖాన్ కలవడం పైన సెటైర్లు వేశారు.

సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి కలిసింది అందుకే
సల్మాన్ ఖాన్ సీఎంను కలవలేదని పని పాట లేని సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బాస్ సైట్ కి వెళ్లి సల్మాన్ ఖాన్ ను కలిశారంటూ టార్గెట్ చేశారు. ఇక మరికొందరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం ముంబై వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్ ను కలిశారని టార్గెట్ చేశారు.
ఇలాంటి ముఖ్యమంత్రిని కనివిని ఎరుగం
ఇక మరో పోస్ట్ లో బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మనం ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని కనివిని ఎరుగమని, అయినా రాష్ట్రం వరదలను ఎదుర్కొంటున్న కష్టకాలంలో, రైతుల పంటలు దెబ్బతిని దిక్కుతోచని స్థితిలో దుఃఖిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ముంబైలోని బిగ్ బాస్ షూటింగ్ సెట్‌కు ఒక నటుడిని కలవడానికి ప్రయాణించారని సెటైర్లు వేశారు.
Naana Anakondal,
— Dr.Krishank (@Krishank_BRS) October 31, 2025
Salman didnt meet CM ,
Pani paata leni CM went to Mumbai to meet Salman in Big Boss shooting set 😀 https://t.co/GLBVUTL6ID
రేవంత్ నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హులు
రేవంత్ గారూ, మీరు నిజంగా ఆస్కార్ అవార్డుకు అర్హులు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ శనివారం రాత్రి 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున బిగ్ బాస్ షోకు వెళతారు అంటూ మరో సంచలన పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై పర్యటన ప్రతిపక్ష పార్టీలు ఆయనను టార్గెట్ చేసేలా చేశాయి. ముఖ్యంగా ఆయన, సల్మాన్ ఖాన్ కలవడం ఆసక్తికర ఊహాగానాలకు కారణమైంది. చివరకు నాగార్జున బిగ్ బాస్ షోను కూడా టార్గెట్ చేసేలా చేసింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications