Bigg Boss Telugu 5: నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందా?: జూనియర్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని అందగాడు నాగార్జున.. హోస్ట్‌గా అదరగొట్టాడు. ఫస్ట్ లుక్‌లోనే ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. బిగ్ బాస్ హౌస్‌లో వీక్షకులను తనతో పాటు తీసుకెళ్లేలా చేయగలిగాడు నాగ్. సీజన్ 5 కంటెస్టెంట్లను పరిచేయం చేయడంలో అదే జోరును కొనసాగించాడు.
తొలి రెండు సీజన్లకు ఇద్దరు
హోస్టింగ్ విషయంలో అక్కినేని నాగార్జున సరికొత్త రికార్డ్ సృష్టించినట్టయింది. హోస్ట్‌గా ఆయనకు ఇది మూడో సీజన్. బిగ్ బాస్ సీజన్ మొదలయ్యిందే జూనియర్ ఎన్టీఆర్‌తో. ఫస్ట్ సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. సెకెండ్ సీజన్‌కు వచ్చే సరికి హోస్ట్ మారిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ తరహాలో ఒక్క సీజన్‌కే అతను పరిమితం అయ్యాడు. రెండో సీజన్‌కే అతని హోస్టింగ్‌కు బ్రేక్ పడింది. వేర్వేరు కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ గానీ, నాని గానీ బిగ్‌బాస్ హోస్ట్స్‌గా కొనసాగలేకపోయారు.
మూడో సీజన్ నుంచి హ్యాట్రిక్..
బిగ్‌బాస్ మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హవా మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్, నాని తరహాలో ఆయన ఒక్క సీజన్‌కే పరిమితం కాలేదు. కంటిన్యూ అవుతోన్నాడు. హోస్ట్‌గా మూడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఏ ఏడాదికి ఆ ఏడాది, ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో ఫుల్ ఎనర్జీతో కనిపిస్తోన్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా స్పందిస్తున్నారు. తనదైన మార్క్ వేశారాయన ఇప్పటికే.
మళ్లీ జూనియర్ కోసం పట్టు..
హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సక్సెస్ అవుతున్నప్పటికీ.. ఆయన మీద కొంత వ్యతిరేకత నెలకొన్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభం నుంచే కొంత ప్రతికూల గాలి అనేది వీస్తున్నట్టు ఉంది. నాగార్జునకు బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ హోస్ట్‌గా తీసుకుని రావాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రత్యేకించి- జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఈ రకమైన డిమాండ్‌ను సోషల్ మీడియా వేదికగా లేవదీస్తోన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ బిగ్‌బాస్ హోస్ట్‌గా చూడాలనుకుంటున్నామని స్పష్టం చేస్తోన్నారు.
జూ. ఎన్టీఆర్‌లా ఎంటర్‌టైన్ చేయలేకపోతున్నారంటూ..
అక్కినేని నాగార్జున మాత్రమే కాదు.. నాని కూడా హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లా వీక్షకులను ఎంటర్‌టైన్ చేయలేకపోయారని చెబుతున్నారు అభిమానులు. జూనియర్‌లాగా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోను హ్యాండిల్ చేయలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. కొందరు ఎన్టీఆర్ అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై డిబేట్‌ను మొదలు పెట్టారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఫర్వాలేదనిపిస్తున్నారని, ఎన్టీఆర్ తరహాలో హైప్ కనిపించట్లేదని చెబుతున్నారు. తమ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌ను అసలు మ్యాచ్ కూడా చేయట్లేదని, నాగార్జున హోస్టింగ్ బోర్ కొడుతోందని అంటోన్నారు.
Recommended Video
క్యాంపెయిన్‌గా మారుతుందా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభంలోనే సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఈ నెగెటివ్ వైబ్రేషన్స్.. ఈ సీజన్ ముగిసే సమయానికి మరింత ఉధృతంగా మారే అవకాశాలు లేకపోలేదు. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ నాటికి జూనియర్ ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా చూడాలనుకుంటున్నామని చెబుతున్నారు. ఎవరి విజన్ వాళ్లది అయినప్పటికీ.. ఎన్టీఆర్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుందని వీక్షకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు.












Click it and Unblock the Notifications