వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేర్లు మార్చి అవే దించేశారుగా: బీజేపీ మేనిఫెస్టో కాపీయేనా?, కేటీఆర్ ఏమన్నారు..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల గడువు ముందు బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం విడుదలైన ఈ మేనిఫెస్టో జాబితా చూశాక.. చాలామందికి అవి 'టీఆర్ఎస్' పథకాలకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. కాస్త అటు, ఇటుగా పేర్లు మార్చేసి కొన్ని పథకాలను బీజేపీ కాపీ కొట్టేసిందంటున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం.. బీజేపీ తమ పథకాలను అనుకరించడం పరోక్షంగా తమను అభినందించడమేనని ట్వీట్ చేశారు.

బీజేపీ మేనిఫెస్టో:

బీజేపీ మేనిఫెస్టో:

  • పంటకు కనీస మద్దతు ధర లభించేలా రూ.5000 కోట్లతో 'రైతుబంధు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌' ఏర్పాటు
  • చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కల్యాణి
  • నాగలి సంక్షేమ పథకం కింద 20 లక్షల మంది మెట్ట రైతులకు రూ.10 వేలు ఆర్థిక సాయం
  • అందుబాటు ధరల్లో ఆహారాన్ని అందించడానికి 300 సీఎం అన్నపూర్ణ క్యాంటీన్‌లు
  • 'వివాహ మంగళ పథకం' ద్వారా వధువుకు రూ.25 వేల నగదు
  • మూడేళ్లలో నేతన్నలకు రూ. లక్ష వరకూ రుణమాఫీ
  • హుబ్లీ, బెంగళూరు, రాయ్‌చూర్‌, మైసూరు, కలబురిగి, మంగళూరుల్లో 6 కె-హబ్‌లు
  • సాగుకు 10 గంటల విద్యుత్తు సరఫరా

కాపీ కొట్టారన్న కేటీఆర్..:

కాపీ కొట్టారన్న కేటీఆర్..:

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి వాటిని కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో కాపీ కొట్టడం సంతోషకరమన్నారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. ప్రశంసకు అనుకరణ ఉత్తమ మార్గమని శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ కాపీ కొట్టిన పథకాల్లో కొన్నింటిని ఆయన తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

  • మిషన్ కాకతీయ- మిషన్ కళ్యాణి
  • కల్యాణలక్ష్మీ- వివాహా మంగళ యోజన
  • చేనేత రుణాలు రూ. లక్ష వరకు రుణమాఫీ
  • టిఎస్ ఐపాస్ తరహాలో పరిశ్రమలకు అనుమతులు
  • టి హబ్- కె హబ్
  • జిహెచ్‌ఎంసి రూ. 5 భోజన పథకాన్ని ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటిన్స్‌గా తమ మేనిఫెస్టోలో బిజెపి పొందుపరిచింది.
  • టీఆర్ఎస్ కు మేలుచేసేలా:

    టీఆర్ఎస్ కు మేలుచేసేలా:


    టీఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టడం.. పరోక్షంగా కేసీఆర్ సర్కారుకు మంచి మార్కులు వేయడమే. దేశవ్యాప్తంగా తమ పథకాలు అందరికీ ఆదర్శంగా మారుతున్నాయని టీఆర్ఎస్ చెబుతుంటే.. విపక్షాలు దానిపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడా వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి టీఆర్ఎస్ కు మరో అస్త్రం దొరికినట్టయింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఇది కాస్త ఇబ్బందికర పరిణామమే.

    మేనిఫెస్టో గెలిపిస్తుందా?:

    మేనిఫెస్టో గెలిపిస్తుందా?:

    టీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టినంత మాత్రానా బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో గెలుస్తుందా? అంటే చెప్పడం కష్టమే. ఒకవేళ బీజేపీ గెలిస్తే తమ పథకాలను కాపీ కొట్టడం వల్లే ఆ పార్టీ గెలిచిందని టీఆర్ఎస్ చెప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ ఫ్రంటు ప్రయత్నాలన్నీ బీజేపీకే మేలు చేసేలా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో ఇలాంటి పరిణామం ఆ పార్టీకి ప్రతికూలంగానూ మారవచ్చు. అయినా కేవలం మేనిఫెస్టోపై ఆధారపడి బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఎంతవరకు నెగ్గుకొస్తుందో చూడాలి మరి!.

English summary
Telangana State’s success story on various fronts has found an echo in the BJP manifesto for the Karnataka Assembly elections released on Friday. Many of the programmes announced by the party are literally mirror images of major
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X