రేవంత్ వ్యాఖ్యలు, బీజేపీకి కూడా కాలింది: ఇప్పటి దాకా సమాధానం లేదు, టిడిపి హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన రేవంత్ పైన పరోక్ష విమర్శలు చేశారు.

చదవండి: ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు

మంగళవారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో రెండే వర్గాలు ఉన్నాయని చెప్పడాన్న ఆయన ఖండించారు.

అలా చెప్పి మభ్యపెడుతున్నారు

అలా చెప్పి మభ్యపెడుతున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు అంటూ వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇలాంటి వాటిని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. అనుకూల, వ్యతిరేక వర్గాలు అని చెప్పుకుంటున్న రెండూ రెండే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.

బీజేపీకి అక్కడే కాలింది

బీజేపీకి అక్కడే కాలింది

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ అనుకూల, కేసీఆర్ వ్యతిరేక వర్గాలు రెండే ఉన్నాయని రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బిజెపి లేనే లేదన్నారు. కేసీఆర్ వ్యతిరేక వర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారు. తెలంగాణలో బిజెపి ప్రభావం లేదని ఆయన అభిప్రాయం. ఆ పార్టీని లెక్కలోకి కూడా తీసుకోలేదు. దీంతో ఆ పార్టీకి అక్కడే కాలిందని అంటున్నారు.

ఇప్పటిదాకా టి-టిడిపికి వివరణ ఇవ్వని రేవంత్ రెడ్డి

ఇప్పటిదాకా టి-టిడిపికి వివరణ ఇవ్వని రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసినట్లు మీడియాలో వార్తలు రావడం, ఆ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగడంపై టిడిపి అధిష్టానం ఆయన నుంచి వివరణ కోరింది. చంద్రబాబు ఆదేశాల మేరకు టి-టిడిపి అధ్యక్షులు రమణ వివరణ కోరారు. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రాలేదు.

ఎప్పడికప్పుడు చంద్రబాబు దృష్టికి

ఎప్పడికప్పుడు చంద్రబాబు దృష్టికి

పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలంగాణ టిడిపి నేతలు.. చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై రమణ కూడా మంగళవారం మాట్లాడిన విషయం తెలిసిందే. రేవంత్ ఎదగడానికి తాను ఎంతో కృషి చేసినట్లు రమణ తెలిపారు. కానీ పార్టీని దాటి వ్యక్తిగతంగా బలోపేతం కావాలని ఆయన భావించినట్లు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని, ఎవరు దేనిపై మాట్లాడాలో అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి సహా ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు ఉంటాయని రమణ హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana BJP chief Dr K Laxman fired at Telangana Telugu Desam working president Revanth Reddy for his comments on Telangana political situation and BJP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి