ఆ విషయంలో వెనుకబడిన బీజేపీ.. ఇలాగైతే ఎలా.. కార్యకర్తల్లో ఆందోళన!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి . ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా brs వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.

ఇప్పటికే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు వారికి బీ ఫారాలు కూడా అందజేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జోరుగా ప్రచారం సాగించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ప్రజాక్షేత్రంలో అందరికంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది బి ఆర్ ఎస్ పార్టీ.

BJP is backward in candidates announcement... bjp activists in tension!!

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి ఆమె ప్రత్యామ్నాయమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించింది. మిగతా అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.

ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దూకుడు చూపించిన బిజెపి, ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆ దూకుడును కొనసాగించలేకపోతుంది. ఇప్పటివరకు బిజెపి తరఫున ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడంతో, ఎవరిని బిజెపి అభ్యర్థిగా ప్రకటిస్తారనే డైలమా ఆయా నియోజకవర్గాలలో ఉన్న నేతలలో నెలకొంది. బిజెపి అభ్యర్థుల ఎంపికలో ఇంకా చర్చల దశలోనే ఉండడం, అభ్యర్థులను ప్రకటించకపోవడం బీజేపీకి మైనస్ గా కనిపిస్తుంది.

తెలంగాణ బిజెపి అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులలో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు ఎవరో ఫైనల్ అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందే ప్రయత్నాలు చేయొచ్చు కానీ, అభ్యర్థి ఎవరో ఇంతవరకు ఫైనల్ చేయకపోవడంతో బిజెపి శ్రేణులు గందరగోళ స్థితిలో ఉన్నారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో బిజెపి అందరికంటే వెనకబడి పోవడం పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలకు దీటుగా పైఎత్తులు వేస్తూ ముందంజలో ఉండవలసిన చోట అలా కాకుండా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ అభ్యర్థుల ప్రకటనపై జాప్యం చేయడం బిజెపిని వెనక్కు నెడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+