విమానాశ్రయంలో రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో ఇటీవల గో హత్య కారణంగా జరిగిన అల్లర్లలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే రాజా సింగ్ మెదక్ వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
ఈ క్రమంలో రాజా సింగ్‌ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాజా సింగ్‌ను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ఎస్కార్ట్‌తో రాజా సింగ్ ను పోలీసులు ఆయన ఇంటికి తరలించారు.

మెదక్ జిల్లా కేంద్రంలో గో హత్యకు సంబంధించి రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ వివాదం కాస్త భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దాడుల నేపథ్యంలో బీజేపీ నేతలు మెదక్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘర్షణలను ప్రోత్సహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఐజీ రంగనాథ్ హెచ్చరించారు. గొడవలకు బాధ్యులైన వారిని ఎవరినీ విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
Arrested by Telangana Police at the airport while on the way to Medak to meet @BJP4Telangana Karyakartas who were attacked by goons.@narendramodi @AmitShah https://t.co/oikZn0K4m8 pic.twitter.com/qY0csXAxpg
— Raja Singh (@TigerRajaSingh) June 16, 2024
ప్రస్తుతం పరిస్థితులో అదుపులో ఉన్నాయన్నారు. టౌన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మెదక్ లో దాడులు, ఉద్రిక్తతలు నెలకొనడానికి కారకులెవరనేది గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications