తీవ్రవాదులకు సాయంచేసే పార్టీతో సంబంధాలా: తెరాసకు రాజాసింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడైన అసద్ పైన దేశద్రోహం కేసు పెట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోథ్ ఆదివారం నాడు డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ నేతలు మద్దతు తెలపడం దారుణమని చెప్పారు.


హైద్రాబాద్‌పై ఐసిస్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!, భయానక దాడికి..

ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెరాసకు మజ్లిస్ పార్టీ మిత్రపక్షం కాగా, మజ్లిస్ పార్టీకి తీవ్రవాదులు మిత్రపక్షంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

BJP MLA Raja Singh statement on Terrorists

తీవ్రవాదులకు సాయం చేసే పార్టీతో సంబంధాలు పెట్టుకుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో చెప్పారని తెరాస నేతలను రాజాసింగ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఉగ్రవాదం పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు నివేదిక ఇస్తానని చెప్పారు. ఉగ్రవాదులకు మజ్లిస్ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Raja Singh Loth statement on Terrorists.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి