సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు!

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి హైడ్రాను ఏర్పాటుచేసిన రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా వ్యవస్థ ద్వారా కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేయడంతో రేవంత్ రెడ్డి దూకుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి పలువురు నేతల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుంది.

రేవంత్ రెడ్డిని మెచ్చుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాల విషయంలో ఇదే విధంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ముఖ్యంగా ఓవైసీ సోదరులు చెరువులను కబ్జా చేసి ఫాతిమా కాలేజీ ని నిర్మించారని వారి బెదిరింపులకు భయపడకుండా ఓవైసీ సోదరులు నిర్మించిన కాలేజేని కూల్చివేయాలని రాజాసింగ్ రేవంత్ రెడ్డికి సూచించారు.

BJP MLA Raja Singh supports CM Revanth Reddy targets asaduddin owaisi brothers

ఓవైసీ బెదిరింపులకు భయపడకండి
ఓవైసీ సోదరులకు చెందిన ఫాతిమా కాలేజీ పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిని కూడా కూల్చేయాలని రాజసింగ్ విజ్ఞప్తి చేశారు చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి సంకల్పం తీసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు రాజాసింగ్ తెలిపారు. వేల మంది యువత భవిత అంటూ ఓవైసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు భయపడద్దని రాజసింగ్ సూచించారు.

ఉచిత విద్య పేరుతో కోట్లు దండుకుంటున్న ఓవైసీ సోదరులు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లాలని రాజ సింగ్ సూచించారు . ఓవైసీ ని అరెస్టు చేసిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరు ఉందని పేర్కొన్న ఆయన రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ముందుకు సాగాలన్నారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు.

వాటిని బుల్డోజర్ లతో కూల్చేయండి
అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఓవైసీ సోదరుల ఆక్రమణలపైన విచారణ జరిపి బుల్డోజర్లతో వాటిని కూల్చివేయాలని రాజసింగ్ కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి గులాంగిరి చేసిందని విమర్శలు గుర్తించిన రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆక్రమణల కూల్చివేతల పర్వాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+