బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్?: తెలియదంటూ తరుణ్ ఛుగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ భిన్నంగా స్పందించారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరతారన్న విషయం తనకు తెలియదని, దీనిపై తనకు సమాచారం లేదని చెప్పారు.

బూర చేరికపై తెలియదంటూనే..: తరుణ్ ఛుగ్ ఇలా

బూర చేరికపై తెలియదంటూనే..: తరుణ్ ఛుగ్ ఇలా

ఇప్పటి వరకు తనను బూర నర్సయ్య గౌడ్ కలవలేదని చెప్పారు తరుణ్ ఛుగ్. రాజకీయ క్షేత్రంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అని గుర్తు చేసిన ఆయన.. ఎవరు ఎప్పుడైనా పార్టీలో చేరవచ్చని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య చేరికపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా స్పందించారు.

బూర నర్సయ్య బీజేపీలో చేరుతున్నారంటూ..

బూర నర్సయ్య బీజేపీలో చేరుతున్నారంటూ..

నడ్డాతో హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల వ్యవహారంపై చర్చించామని తరుణ్ ఛుగ్ తెలిపారు. కాగా, బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చాయి. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నర్సయ్య గౌడ్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారంటూ ప్రచారం జరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సూచనతోనే బూర నర్సయ్య ఢిల్లీకి వెళ్లారని వార్తలు వచ్చాయి.

టీఆర్ఎస్‌లో కీలకంగా బూర నర్సయ్య గౌడ్.. కానీ..

టీఆర్ఎస్‌లో కీలకంగా బూర నర్సయ్య గౌడ్.. కానీ..

కాగా, బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2013లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించినా.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఖాయం చేశారు. దీంతో బూర అసంతృప్తితో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+